ప్రియా వారియర్ వలనే సినిమా ఆడట్లేదు : నూరిన్

మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ‘లవర్స్ డే’ చిత్రం ఇటీవల ప్రేమికుల రోజున విడుదలై ప్లాప్ టాక్ ను మూట కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఒమర్‌ లులు డైరెక్ట్ చేయగా… ‘సుఖీభవ సినిమాస్‌’ బ్యానర్ పై ఎ.గురురాజ్, సి.హెచ్‌. వినోద్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రధానంగా ఈ చిత్రం క్లైమాక్స్ పై ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురవ్వడంతో.. మళ్ళీ క్లైమాక్స్ ని రీషూట్ చేసి… ఫిబ్రవరి 23 (ఈరోజు) నుండీ ఆ క్లైమాక్స్ ని జత చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. అయినప్పటికీ థియేటర్లకి మళ్ళీ ప్రేక్షకులు వస్తారా… అంటే డౌటే అని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా ప్రియాప్రకాష్ వారియర్ పై ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటించిన నూరిన్ షెరీఫ్ కొన్ని సంచలన కామెంట్స్ చేసింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నూరిన్… ఈ చిత్రం గురించి కొన్ని సంచలన విషయాలను తెలియజేసింది. నూరిన్ మాట్లాడుతూ… “నిజానికి ఈ చిత్రంలో మొదట హీరోయిన్ నేను….. కానీ వింక్ వీడియో తో ఓవర్ నైట్ లో ప్రియా ప్రకాష్ కి క్రేజ్ ఏర్పడటంతో … దర్శక,నిర్మాతలు స్క్రిప్ట్ ను మార్చేసారు. ప్రియా ప్రకాష్ కు మెయిన్ హీరోయిన్ రోల్ ఇచ్చేసారు. నా పాత్ర మొత్తం తగ్గించేశారు. ఈ చిత్రంలో నా ప్రాధాన్యత లేకుండా చేసేసారు. దీంతో సినిమా మొత్తం మారిపోయి… అస్సలు ఆడటం లేదు. అలా చేయటంలో ప్రియా ఒత్తిడి కడా ఉంది. ఒకవేళ మరోసారి హీరో రోషన్ తో పనిచేసే అవకాశం వస్తే కాదనను… కానీ మళ్ళీ ప్రియా ప్రకాష్ తో మాత్రం అస్సలు కలిసి నటించను” అంటూ తన ఆవేదనని వ్యక్తం చేసింది నూరిన్. నూరిన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus