జై లవకుశలో రాజకీయనాయకుడిగా ఎన్టీఆర్
- May 30, 2017 / 05:58 AM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ‘జై లవ కుశ’ చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకు సంబంధిన ఫస్ట్ లుక్ ని ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించకుని విడుదల చేశారు. ఇందులో రౌద్రరసాన్ని పలికిస్తున్న తారక్.. మరో ఫోటోలో చేతులను గొలుసుతో కట్టేసి ఉండగా అభివాదం చేస్తున్నట్లు ఉంది. ఈ ఫోటోలలో రావణాసురుని విగ్రహాన్ని చూపిస్తూ ఇతనే విలన్ అని చెప్పకనే చెప్పారు. ఆ క్యారెక్టర్ గురించి ఆసక్తిగా విషయం బయటికి వచ్చింది. జై క్యారెక్టర్ పవర్ ఫుల్ రాజకీయనాయకుడని, ఆ పవర్ తో దుర్మార్గాలు చేస్తుంటారని వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.
అంతేకాదు అతను రాజకీయ వ్యవస్థపై పంచ్ లు వేస్తాడని సమాచారం. అయితే ఇవేమీ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును టార్గెట్ చేసేలా మాత్రం ఉండవంట. రియల్, రీల్ లైఫ్ లో నేత గా ఎన్టీఆర్ ని చూడాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. సో ముందుగా తెరపై పొలిటికల్ లీడర్ గా కనిపించడం ఫ్యాన్స్ కి ఎంతో ఆనందాన్నీ కలిగిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














