ఒకప్పుడు మార్కెట్ లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు.. సీనియర్ ఎన్టీఆర్ వెంటనే కోనేసేవారు. లగ్జరీ కార్లంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన తరువాత జూనియర్ ఎన్టీఆర్ కి కార్లంటే ఎక్కువ ఇష్టమని చెప్పుకునేవారు. ప్రతీ ఏడాది కొత్త కారు కొనడం ఎన్టీఆర్ కి అలవాటు. కానీ కొన్నేళ్లుగా ఆయన తన కారుని మార్చలేదు. కానీ ఇప్పుడు కొత్త కారు కొంటున్నారు. అది కూడా సూపర్ స్పోర్ట్స్ కార్ కావడం విశేషం.
కార్లలో అత్యంత విలువైన లంబోర్ఘిని ఉరుస్ (Lamborghini Urus) మోడల్ కారును ఎన్టీఆర్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు ఇటలీ నుండి ఇండియాకు దిగుమతి అవుతోంది. దీని ఖరీదు రూ.5 కోట్లని తెలుస్తోంది. విలాసవంతమైన ఈ కారు ఎలాంటి ప్రాంతాల్లోనైనా.. పరుగులు తీస్తుంది. ఎడారి ప్రాంతం, కొండ ప్రాంతాల్లో కూడా ఈ కారుని డ్రైవ్ చేయొచ్చు. ఇలాంటి కాస్ట్లీ కారుని హైదరాబాద్ రోడ్ల మీద నడిపించనున్నాడు ఎన్టీఆర్. ఇక సినిమాల విషయానికొస్తే..
ప్రస్తుతం ఈ హీరో రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అలానే లైన్ లో ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు కూడా ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఎన్టీఆర్ నుండి రాబోయేవన్నీ పాన్ ఇండియా కథలేనని చెబుతున్నారు.