దువ్వాడ జగన్నాథం పై ఎన్టీఆర్ కామెంట్స్!

  • June 9, 2017 / 06:06 AM IST

టాలీవుడ్ లో కుర్ర హీరోలు అందరూ మేమంతా ఒక్కటే అంటూ తమ మధ్య ఉన్న స్నేహం భందాన్ని అందరికీ ముచ్చట వేసేలా కలసి ఉంటారు. ఇక మరో పక్క వారి అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ డప్పులు కొట్టుకుంటూ ఉంటారు. కొందరు అయితే ఏకంగా ఆన్‌లైన్ లో రిలీజ్ అయితే ట్రైలర్స్ కి, టీజర్స్ కి డిస్‌లైక్స్ కొట్టుకుంటూ తమ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో యువ హీరోల్లో మంచి స్నేహితులు సైతం ఉండడం విశేషం అందులో ముఖ్యంగా తమ చరిష్మాని పక్కన పెట్టి ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరూ మంచి ప్రాణ స్నేహితులుగా టాలీవుడ్ లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే అదే క్రమంలో మన యువ హీరోల్లో ప్రతీ ఒక్కరూ ఏ హీరో సినిమా ట్రైలర్, టీజర్ , లేదా ఫర్స్ట్ లుక్ రిలీజ్ అయినా కాంప్లిమెంట్స్ ఇవ్వడం షరా మామూలే, గతంలో ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ అయినపుడు మహేష్, బన్నీ, చెర్రీ ఇలా స్టార్ హీరోలంతా ట్రైలర్ బాగుంది అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇక అసలు విషయం ఏమిటి అంటే, తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం ట్రైలర్ 5 తారీఖు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక రెండు రోజుల్లో కోటి వ్యూస్ ని దక్కించుకున్న ఈ సినిమా బాహుబలి తర్వాతి స్థానంలో నిలిచింది. సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయనేది ఈ వ్యూస్ తో అర్ధమవుతుంది.

అయితే ఇప్పటికే  ఈ ట్రైలర్ పై చాలా మంది సెలబ్రెటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ట్రైలర్ పై తన అభిప్రాయం తెలియచేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్రైలర్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ హరీష్ శంకర్ గురించి నాకు తెలుసు…నా అదుర్స్ సినిమాలో చారి గెటప్ ని డిజైన్ చేసి డైలాగ్స్ రాశారు. నా బాడీ లాంగ్వెజ్ ఎంతగా మార్చాడో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిజే ట్రైలర్ ని చూశాను. దాంట్లో అల్లు అర్జున్ ని పూర్తిగా మార్చేశాడు హరీష్. ఇకపోతే అల్లు అర్జున్ కూడా పెర్ఫార్మెన్స్ బాగా చేశాడు. ఈ ట్రైలర్ లో బన్నీ రెండు భిన్నమైన పాత్రల్లో చేసి మెప్పిస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాకుండా అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ బాగా ఉన్నది.సో అల్లు అర్జున్ కి హరీష్ శంకర్ కి అల్ ది బెస్ట్ అంటూ సినిమా ట్రైలర్ బాగుంది. ఇదే కథను హరీష్ శంకర్ నాకు కనుక చెప్పి ఉంటె అదుర్స్ 2 అని టైటిల్ పెట్టి మేమే చేసి ఉండేవాళ్ళం. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఎంతో బాగుంది అని ఎన్టీఆర్ అన్నారు. మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ బన్నీని తనదైన శైలిలో పొగిడేసాడు అనే చెప్పాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus