RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

ఎన్టీఆర్‌ అభిమాన సంఘం అంటూ మొదలై.. ఎన్టీఆర్‌ని స్ఫూర్తిగా తీసుకొని.. ఎన్టీఆర్‌ తరఫున సేవా కార్యక్రమాలు చేస్తాం అనే వరకు వెళ్లి.. ఎన్టీఆర్‌కి ఆ విషయం తెలిసో తెలియదు అనేంతవరకు వెళ్లి.. ఇప్పుడు ఏకంగా మూతబడిపోయింది. అదే RAWNTR. అవును, గత కొన్ని రోజులు టాక్‌ ఆఫ్‌ ది తెలుగు సినిమా. టాక్‌ ఆఫ్‌ ది తెలుగు రాష్ట్రాలుగా మారిన రాఎన్టీఆర్‌ సంస్థ కార్యకలాపాలు నిలిపేశారు. ఎన్టీఆర్‌ ఆపమని చెప్పినా పనులు ఆపేది లేదు అని చెప్పిన రాఎన్టీఆర్‌ వ్యవస్థాపకుడు ఇప్పుడు ఏ కారణం చేతనో ఆపేశారు.

RAWNTR

‘ఊరు వాడ’ పేరుతో భారీ సేవా కార్య‌క్రమం చేప‌డ‌తాం అంటూ తార‌క్ అభిమాని సాయి రూప్ ఆ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు RAWNTR అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ముందు విజ‌య్ తన అభిమాన‌ల సంఘాల‌తో ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన నేప‌థ్యంలో తార‌క్ కూడా అదే చేస్తున్నాడా అనే చర్చలు జరిగాయి. అయితే ఆ సంస్థకు, ఎన్టీఆర్‌కు సంబంధం లేదని ఎన్టీఆర్‌ కార్యాలయం బహిరంగ ప్రకటన విడుదల చేసింది.

అప్పుడు కూడా సాయి రూప్‌ వెనక్కి తగ్గలేదు. కానీ ఇప్పుడు విజ‌యం సాధించిన వాళ్లంద‌రికీ మా అభినంద‌న‌లు అంటూ వ్యంగ్యంగా ఒక కామెంట్ పెట్టి రాఎన్టీఆర్ కార్య‌క‌లాపాల‌ను నిలిపేస్తున్నాం అని ఆ పోస్టులో రాసుకొచ్చింది. ఇటీవల హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ప్రెస్ మీట్లు పెట్టిన సాయి రూప్.. తాము ఐదారేళ్లుగా మంచి ప‌నులు చేస్తున్నామ‌ని.. త‌మ సంస్థ‌లో తార‌క్ అభిమానులు సుమారు 40 వేల మంది ఉన్నారని కూడా చెప్పారు. అయితే ఎన్టీఆర్ పేరు చెప్పుకుని సాయి రూప్‌ ప‌బ్లిసిటీ చేసుకుంటున్నాడ‌ని, ఇదంతా తార‌క్‌కు అప్ర‌తిష్ఠ తీసుకురావడమే అని కొంతమంది అభిమానులు కామెంట్లు చేశారు.

తనతో ఎన్టీఆర్‌ ఎందుకు మాట్లాడటం లేదు అని ఆ మధ్య ఓ ప్రెస్‌ మీట్‌లో సాయి రూప్‌ అన్నారు. అలాగే ఎన్టీఆర్‌ చెప్పినా ఆగను అన్నారు. దీంతో ఎవరు చెప్పారని ఆయన ఆగారు అనేదే ప్రశ్న.

రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus