యంగ్ టైగర్ ఎన్టీఆర్…టాలీవుడ్ లోని రికార్డులు తిరగరాయగల హీరోల్లో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు అని చెప్పక తప్పదు. ప్రతీ హీరోలో ఏదో ‘ఒక’ టాలెంట్ ఉంటుంది. కానీ అన్నీ కలగలిపి ఉన్న అతి తక్కువ మంది యువ హీరోల్లో ఎన్టీఆర్ ఒకడు అని ఒప్పుకోక తప్పదు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మంచి నటుడు మాత్రమే కాదు, మంచి మనిషి కూడా, రెమ్యునిరేషన్ విషయంలో కొందరు హీరోలు డిమాండ్ చేసినట్లుగా ఎన్టీఆర్ ఎప్పుడు డిమాండ్ చేసిన వార్తలు ఎక్కడా రాలేదు. అంతేకాదు ఎన్టీఆర్ సినిమా నిర్మాతలను ఆదుకునే విషయంలో చాలా హెల్ఫుల్ గా ఉంటాడు. మరి అలాంటి ఎన్టీఆర్ పై ఎన్టీఆర్ డబ్బు మనిషి అన్న వదంతులు వస్తూఉండడంతో ఎన్టీఆర్ బాధపడ్డాడట. అసలు మ్యాటర్ ఏంటి అంటే స్టార్ మా ఛానల్ కోసం బిగ్ బాస్ షో తెలుగు వెర్షన్ చేసేందుకు టాలీవుడ్ బాద్ షా అంగీకరించాడని…ఇందుకోసం పెద్ద మొత్తంలో…అంటే 8-10 కోట్ల మొత్తం పుచ్చుకోనున్నాడని రూమర్స్ వచ్చేశాయి.
ఈ న్యూస్ ఎన్టీఆర్ ను బాగా హర్ట్ చేసిందని తెలుస్తోంది. బిగ్ బాస్ షో చేసేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నా… ఇప్పటివరకూ రెమ్యూనరేషన్ కు సంబంధించిన అగ్రిమెంట్స్ ఏవీ జరగలేదట. అది కూడా.. మీడియాలో వార్తలు వస్తున్న స్థాయిలో పుచ్చుకునే అవకాశాలు లేవని అంటున్నారు. అయితే టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ కి బుల్లి తెర విషయంలో ఇలా నెగేటివ్ ప్రచారం జరుగుతూ ఉండడంతో చాలా హర్ట్ అయ్యాడని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు చెబుతూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే, ఇదే నిజం అయితే ఎన్టీఆర్ ఈ షో చెయ్యడనే తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.