బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా జై లవకుశ సినిమా రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. తొలిసారి తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 న థియేటర్లలో రానుంది. అంటే ఇంకా ముప్పై రోజుల సమయం ఉంది. ఇన్నిరోజుల్లో రెండు పాటలను కంప్లీట్ చేసి.. ప్రచారం నిర్వహించడం పెద్ద కష్టమేమి కాదు. అయితే ఇందులో పది రోజులు బిగ్ బాస్ షోకి తారక్ కేటాయించాల్సి ఉంటుంది. దీంతో సినిమాకి 20 రోజులు మాత్రమే మిగిలాయి. ఇందులో రెండు పాటలకు పది రోజులు ఖర్చు అయిపోతాయి. మిగిలిన పదిరోజుల్లో డబ్బింగ్ తో పాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
ముంబై కి హైదరాబాద్ కి తిరగాల్సి ఉంటుంది. ఇంత పని ఒత్తిడిలో సినిమా సరైన సమయానికి రిలీజ్ అవుతుందా? అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు మాత్రం ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఎంత పని ఒత్తిడినైనా తట్టుకొని తారక్ పనిచేస్తారని, అనుకున్న తేదీనే జై లవకుశ థియేటర్లోకి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.