యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జూబ్లీహిల్స్‌లో ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. అతని అభిమానులకు అది ఎక్కడ ఉందో కూడా తెలుసు. ప్రతి సంవత్సరం.. ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20 నాడు ఎన్టీఆర్ ఇంటి ముందు అభిమానులు గుమికూడి రచ్చ చేస్తూ ఉంటారు. ఇక అతను పాన్ ఇండియా హీరో అయ్యాక.. ‘ఊర్లలో ఉండే అభిమానులు ఎన్టీఆర్ ను కలవడానికి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాము’ అంటూ సింపతీ కార్డు వాడి మరీ ఎన్టీఆర్ ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు.
ఇలాంటి వాళ్ళ కోసం ఓ మంచి టైం చూసుకుని అందరినీ కలుస్తానని ఇటీవల ఓ వేడుకలో ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. మరోపక్క తన ఇంటిని కోట్ల ఖర్చుతో రెనోవేషన్ చేయించుకున్నాడట ఎన్టీఆర్. ఇటీవల సోషల్ మీడియాలో కూడా ఈ అంశం పై అభిమానులు చర్చించుకోవడం జరిగింది. నెల రోజులుగా ఈ రెనోవేషన్ వర్క్ జరిగినట్లు తెలుస్తుంది. మొత్తానికి అది కంప్లీట్ అవ్వడంతో తన ఫ్యామిలీతో కలిసి తిరిగి తన ఇంట్లోకి అడుగుపెట్టాడట ఎన్టీఆర్.
ఎన్టీఆర్ నటించిన స్ట్రైట్ బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ రిలీజ్ కి రెడీగా ఉంది. మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ కూడా చేస్తున్నాడు. అటు తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా, కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర 2’ సినిమాలు కూడా చేయాల్సి ఉంది. సో మరో 2 ఏళ్ళ పాటు ఎన్టీఆర్ ఫుల్ బిజీ అని అర్థం చేసుకోవచ్చు.