Sandeep Reddy Vanga: ఆ 8 నిమిషాలు లేపేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి వంగా

ప్రతి దర్శకుడికి తన సినిమాపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ సినిమాకి డైరెక్టరే రైటర్ అయితే ఇక చెప్పనవసరం లేదు. సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత ఎక్కువ పోర్షన్ షూట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఎడిటింగ్ టేబుల్ వద్ద డిలీట్ చేయాల్సి వస్తుందేమో.. అనే ఆలోచన వచ్చినా అస్సలు తగ్గరు. టాలీవుడ్లో ఇప్పుడు నిండా ఇలాంటి దర్శకులే ఉన్నారు. 4 గంటలు పైనే ఫుటేజీ వచ్చేలా తీసేస్తున్నారు.

Sandeep Reddy Vanga

తర్వాత ఎడిటింగ్లో ఏ సీన్ కట్ చేయాలో తెలీక తర్జనభర్జన పడుతున్నారు. రన్ టైం విషయంలో తేడా వస్తే.. సినిమా ఫలితమే మారిపోయే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. నాని- వివేక్ ఆత్రేయ..ల ‘అంటే సుందరానికీ’ సినిమా రన్ టైం ఇష్యూతోనే బలైపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి.ఈ విషయాలు పక్కన పెట్టేస్తే..

దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి ఓ క్లారిటీ ఉంటుంది. తన సినిమా కచ్చితంగా ఇంత ఉండాలి అని తీస్తాడు. కాకపోతే అది కచ్చితంగా మూడున్నర గంటలు ఉంటుంది. ఫైనల్ రన్ టైం కూడా మూడు గంటలు ఉండేలా చూసుకుంటాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఈ మూడు సినిమాలు 3 గంటల పైనే రన్ టైం ఉంటాయి.

‘కింగ్డమ్’ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండతో ఒక ఇంటర్వ్యూ చేశాడు సందీప్. ఇందులో ‘యానిమల్’ ఒరిజినల్ రన్ టైం 3 గంటల 45 నిమిషాలు అని తెలిపి షాకిచ్చాడు సందీప్. అతను మాట్లాడుతూ.. ” ‘యానిమల్’ ఫస్ట్ కట్ 3 గంటల 45 నిమిషాలు. అయితే దానిని 3 గంటల 30 నిమిషాలకు కుదించాను. అది నాకు సంతృప్తికరమైనదే. కానీ తర్వాత ప్రెజర్ వల్ల మరో 8 నిమిషాలు కట్ చేయాల్సి వచ్చింది.

అది నాకు చాలా బాధేసింది. నెట్ ఫ్లిక్స్ వెర్షన్ కి అవి పెడదామని అనుకున్నాను. 3 గంటల 45 నిమిషాలు కాకపోయినా… 8 నిమిషాలు యాడ్ చేసి 3 గంటల 30 నిమిషాలు చేయాలనే ఆలోచన ఉంది” అంటూ అతను చెప్పుకొచ్చాడు. ఓటీటీ కాబట్టి.. అది పెద్ద ఇబ్బంది అనిపించదు లెండి.

హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కామెంట్స్.. ఎవరి గురించో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus