సందిగ్ధంలో యంగ్ టైగర్!!!

  • March 18, 2017 / 07:50 AM IST

ఎన్టీఆర్ హిట్ ట్ర్యాక్ లో ఉన్నాడు….యంగ్ టైగర్ విశ్వరూపం చూప్పించే దిశగా అడుగులు వేస్తున్నాడు…వరుసగా మూడు హిట్స్ కొట్టి హ్యాట్రిక్ సక్సెస్ సాధించాడు….ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుని…ఎన్నో కధలు విని బాబీ దర్శకత్వంలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు….అయితే ఈ సినిమాకు “జైలవకుశ” అనే టైటిల్ ను కూడా పెట్టినట్లు టాక్…అయితే అసలు విషయం ఇక్కడే ఉంది….ఈ టైటిల్ చుట్టూనే సెంటిమెంట్ తిరుగుతుంది…విషయంలోకి వెళితే…‘జై లవకుశ’ అన్న టైటిల్ విషయంలో ఎన్టీఆర్ సన్నిహితులు ఎన్టీఆర్ కు అనుకోని ట్విష్ట్ ఇచ్చారని తెలుస్తుంది…ఈ సినిమాకు ఈ టైటిల్ వద్దు అని వారు అంటున్నట్లు సమాచారం…అదే క్రమంలో … దీనికి కారణం సైతం ఉంది అంటున్నారు….అదేంటి అంటే…రెండు సంవత్సరాల క్రితం విడుదలై ఘోర పరాజయం చెందిన ‘శంకరాభరణం’ మూవీ అని తెలుస్తుంది…. కోన వెంకట్ నిర్మించిన ఈమూవీ ఒక సాధారణమైన క్రైం స్టోరీ అయినప్పటికీ దానికి విశ్వనాథ్ దర్శకత్వం వహించిన క్లాసిక్ మూవీ ‘శంకరాభరణం’ మూవీ టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ విషయంలో కోన వెంకట్ దర్శకుడు విశ్వనాథ్ అనుమతి తీసుకున్నా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఒక క్లాసికల్ మూవీ టైటిల్ ను ఒక సాధారణ సినిమాకు పెట్టడం ఏమాత్రం హర్షించలేకపోయారు.

ఈ విషయంలో తాను పొరపాటు చేసినట్లు కోన వెంకట్ కూడ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు అదే పరిస్థితి జూనియర్ ‘జై లవకుశ’ కు ఎదురు కాబోతోంది అంటూ జూనియర్ సన్నిహితులు తారక్ ను హెచ్చరిస్తున్నట్లు టాక్. దీనికి కారణం ‘లవకుశ’ అన్న టైటిల్ కూడ ఒక క్లాసిక్ మూవీకి సంబంధించింది అని నందమూరి తారకరామారావు రాముడుగా నటించిన ఒక అద్భుతమైన క్లాసికల్ మూవీ టైటిల్ ను ఒక మాస్ మసాల సినిమాకు ఎందుకు వాడుతున్నారు అంటూ కొందరు జూనియర్ కు క్లాస్ పీకుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడే ఇదే ఎన్టీఆర్ ను సందిగ్ధంలో పడేయగా…కల్యాణ్ రామ్ సైతం దీనిపై ఆలోచించి మరో టైటిల్ ను పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది….చూద్దాం ఏం జరుగుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus