కొత్త సెంటిమెంట్ ఎన్టీఆర్ కి మరోసారి కలిసి వస్తుందా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వ్యక్తిగతంగా, వృత్తి పరమైన కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. తొమ్మిది అంకెను తన లక్కీ నంబర్ గా భావిస్తారు. డైరక్టర్ రాజమౌళితో సినిమా అంటే హిట్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోతారు. అయితే తాజాగా ఓ సెంటిమెంట్ అతని ఖాతాలో చేరిందంట. అది ఏమిటంటే.. ఏ డైరక్టర్ అయినా ఫ్లాప్ చూసిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమా తీస్తే.. ఆ మూవీ హిట్టే. దీనికి గత సినిమాలే సాక్ష్యం. సుకుమార్ “వన్ నేనొక్కడినే” ఫెయిల్యూర్ తరువాత తీసిన “నాన్నకు ప్రేమతో” సూపర్ హిట్ అయింది. అలాగే రోమియో వంటి ఫెయిల్యూర్ తర్వాత పూరి జూనియర్ తో తీసిన “టెంపర్” హిట్ అయింది.

అలాగే “సర్దార్ గబ్బర్ సింగ్” తో ఫ్లాప్ చూసిన దర్శకుడు బాబీ.. ఎన్టీఆర్ తో చేసిన “జై లవ కుశ” ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ అయి తారక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని అభిమానులు సంబరపడుతున్నారు. అజ్ఞాతవాసి సినిమాతో అపజయాన్ని చూసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. యంగ్ టైగర్ తో తీయబోతున్న మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధా కృష్ణ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే నెల సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus