తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోగానే కాకుండా సింగర్ గా కూడా తన కెరీర్ ను సాగిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తెలుగుతో పాటు కన్నడలో కూడా ఓ పాట పాడాడు. పునీత్ రాజ్ కుమార్ కోసం పాడిన ఈ పాటకు మంచి క్రేజ్ రావడంతో ఎన్టీఆర్ కు బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చిందనే వార్తలు వినిపించాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు సంబంధించిన ఓ ఆల్బం లో ఎన్టీఆర్ ను పాట పాడమని అడిగారట. అయితే ఈ వార్తల్లో నిజం లేదంటూ.. ఎన్టీఆర్ సన్నిహితులు తేల్చేశారు. ఒకవేళ ఇలాంటి ఆఫర్ వచ్చినా.. ఎన్టీఆర్ పాడే అవకాశాలు లేవని చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.