నన్ను ‘అన్నా’అనొద్దు అంటున్న ఎన్టీఆర్!!
- July 31, 2017 / 07:59 AM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్…ఈ పేరు వింటే చాలు…మాస్ ప్రేక్షకులు అభిమానంతో ఉర్రూతలూగిపోతారు…అయితే సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని నవరస నటనా నాయకుడిగా ఎదుగుతున్న ఎన్టీఆర్ ఇటు బుల్లి తెరపై కూడా తన టాలెంట్ ని నిరూపించుకుంటున్నాడు…ఇప్పటివరకూ ఏ స్టార్ షో కి రాణి టీఆర్‌పీ రేటింగ్స్ సాధించి బుల్లి తెరపై కూడా ఎన్టీఆర్ నంబర్1 అంటూ “బిగ్ బాస్” షో తో నిరూపించుకున్నాడు… ఎన్టీఆర్…పచ్చిగా మాట్లాడుకుంటే…ఆ షో కి ఎన్టీఆర్ చాలా ప్లస్ అనే చెప్పాలి…ఎందుకంటే…షో జరిగే వారం రోజుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా బోర్ కొట్టే ఛాన్స్ ఉంది ఏమో కానీ వారాంతం లో మాత్రం ఎన్టీఆర్ కనిపించగానే…ఆ షో కి ఎక్కడ లేని ఊపు వచ్చేస్తుంది…తన నటన తో , హాస్టింగ్ తో అందరినీ మెస్‌మెరైస్ చేసేస్తున్నాడు ఎన్టీఆర్..ఇదిలా ఉంటే…
ఈ షో లో ఎన్టీఆర్ కు కంటెస్టెంట్ కల్పనకు కాస్త మాట మాట వచ్చి…ఒకరిపై మరొకరు మాటలు ఖడించుకునే వరకూ వెళ్ళింది వ్యవహారం…అసలు మ్యాటర్ ఏంటి అంటే….ఈ షో లో ఉన్న సింగర్ కల్పన పదే పదే ఎన్టీఆర్ ని “అన్నా అన్నా” అని సంభోదిస్తూ ఉండగా…కాస్త వెయిట్ చేసి…వయసులో ఎన్టీఆర్ కంటే చాలా పెద్దవారు అయిన ఆమె అలా పిలవడం ఎన్టీఆర్ కి నచ్చకపోవడంతో….వెంటనే ‘అమ్మా.. నన్ను దయచేసి అన్నా అని పిలవకు’ అని అన్నాడు….ఇక దీనిపై స్పందించిన కల్పన, ఇకపై ‘తారక్ గారు’ అని సంబోధిస్తానని చెప్పింది. ఇలా ఇద్దరి మధ్య కాస్త మాట మాట పెరిగి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది…అయితే అదంతా ఆ కొన్ని క్షణాలు మాత్రమెలెండి…తరువాత యధావిధిగా షో మ్యాటర్ లోకి వెళ్ళిపోయారు అంతా…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















