యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంతా సిద్దమయింది. ఎన్టీఆర్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలయింది. ఈ మూవీ తరవాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాలని తారక్ అనుకున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ పట్టాలెక్కించాలని భావించారు. అయితే కథ అడ్డం తిరిగింది. త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించనున్న సినిమా ఇంకా మొదలు కాలేదు. దీని తర్వాత డైరక్టర్ ఎన్టీఆర్ ప్రాజక్ట్ గురించి ఆలోచిస్తారు. పవన్ సినిమా ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల… అది పూర్తికావడానికి డిసెంబర్ పట్టవచ్చు.
అప్పటివరకు ఎన్టీఆర్ సమయాన్ని వృధా చేసుకోవడానికి ఇష్టంగా లేరు. అందుకే ఆ డేట్స్ ని వినాయక్ కి ఇస్తే బాగుంటుందని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఆది, సాంబ, అదుర్స్ హిట్ అయ్యాయి. వీరి కాంబో లో మూవీకోసం నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్, పవన్ సినిమా ఆలస్యం వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక తీరబోతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.