NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Advertisement

నాని హీరోగా వచ్చిన ‘హాయ్ నాన్న’ తో శౌర్యువ్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తొలి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

NTR

ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు, శౌర్యువ్ టేకింగ్‌పై ఇండస్ట్రీలో ప్రశంసలు కురిశాయి. ఈ సక్సెస్ ఇచ్చిన కిక్‌తో శౌర్యువ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌ను(NTR) కలిశాడు.

‘హాయ్ నాన్న’ రిలీజ్ తర్వాత తారక్‌ను కలిసి ఓ పవర్ ఫుల్ స్టోరీ వినిపించాడట శౌర్యువ్. ఆ స్క్రిప్ట్ తారక్‌కు కూడా బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపించారట. కానీ, తారక్ లైనప్ అప్పటికే వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ కావడంతో, శౌర్యువ్‌ను కొన్నాళ్లు వెయిట్ చేయమన్నారని టాక్. అలా చాలా కాలం ఎదురుచూసిన డైరెక్టర్.. చివరకు తారక్‌కు విషయం చెప్పి, ఆ ప్రాజెక్ట్‌ను విజయ్ దేవరకొండ దగ్గరికి తీసుకెళ్లాడట. ఆ యాక్షన్ ఎమోషనల్ డ్రామా విన్న వెంటనే విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

రౌడీ హీరో ఇమేజ్‌కు తగ్గట్లు స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు కూడా చేశారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిన్ననే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. “హాయ్ నాన్న”ను నిర్మించిన వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించబోతోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా రంగంలోకి దించుతున్నారని ఇన్‌సైడ్ టాక్. విజయ్ దేవరకొండ తన కరెంట్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయగానే.. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇదిలా ఉంటే.. శౌర్యువ్ తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాని కోసం కూడా మరో స్క్రిప్ట్ రెడీ చేశాడట. ప్రస్తుతం అది డిస్కషన్ స్టేజ్‌లో ఉంది. విజయ్ సినిమా పూర్తయిన తర్వాత నాని ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.

సీనియర్ నిర్మాత మృతి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus