కొత్త డైట్ కి ప్రిపేర్ అవుతున్న ఎన్టీఆర్!
- August 14, 2017 / 09:28 AM ISTByFilmy Focus
మొదటి నుంచి ఎన్టీఆర్ యాక్షన్ సినిమాలు చేయడం వల్ల అందుకు తగ్గట్టు ఉండేవారు. రాఖీ చిత్రం నాటికీ ఎన్టీఆర్ మరింత బరువు పెరిగారు. దీంతో డైటింగ్ పై దృష్టి పెట్టి యమదొంగ చిత్రం నాటికీ చాలా బరువు తగ్గారు. అక్కడి నుంచి కథకి అనుగుణంగా బరువు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు తారక్ బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా చేస్తున్నారు. ఇందులో మూడు క్యారెక్టర్స్ లో మూడు రకాలుగా కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూణేలో జరుగుతోంది. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ కుటుంబ కథా చిత్రం చేయనున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నవంబర్ నుంచి పట్టాలెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. ఆ సినిమాలో చాలా స్లిమ్ గా కనిపించాలని త్రివిక్రమ్ చెప్పడంతో.. అందుకు తగ్గట్టు మారిపోవాలని ఎన్టీఆర్ డైట్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిసింది. జై లవకుశ షూటింగ్ పార్ట్ పూర్తి కాగానే ఆ విధంగా ఆహరం తీసుకోనున్నట్లు సమాచారం. తొలిసారి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపుదిద్దుకోనున్న మూవీ కావడంతో దీనిపై భారీ క్రేజ్ నెలకొని ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















