ఎన్టీఆర్ చేస్తున్న రిస్క్ విజయాన్ని ఇస్తుందా ?

  • June 8, 2017 / 07:11 AM IST

ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుశ సినిమాపై ఫిలిం నగర్లో రోజుకో చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఓ అనుమానం సినీ విశ్లేషకులను నిద్రలేకుండా చేస్తోంది. అది ఏమిటంటే.. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ తీసిన దర్శకుడు హరీష్ శంకర్ తో వెంటనే ఎన్టీఆర్ “రామయ్య వస్తావయ్య” సినిమాని చేశాడు. ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఇప్పుడు ప్లాన్ చేంజ్ చేసాడు. సర్దార్ గబ్బర్ సింగ్ వంటి ప్లాప్ సినిమా తీసిన బాబితో వెంటనే జై లవకుశ చేస్తున్నాడు. బాబీ గత చిత్రం ఫలితాన్ని పట్టించుకోకుండా, కథ మీద నమ్మకంతో ఒకే చేసాడు. గబ్బర్‌సింగ్‌ డైరెక్టర్‌ ఎన్టీఆర్ కి ప్లాప్ ఇచ్చాడు, మరి సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ దర్శకుడు ఎన్టీఆర్‌కి హిట్ఇస్తాడా?, ఎన్టీఆర్‌ తీసుకున్న రిస్క్‌కి తగ్గ రిజల్ట్‌ జై లవకుశతో వస్తుందా? అని సందేహాన్ని టాలీవుడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

అయితే నందమూరి అభిమానులు మాత్రం జై లవకుశ విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నారు. “గబ్బర్ సింగ్ కి హరీష్ శంకర్ కాన్ఫిడెన్స్ పీక్స్ లో ఉండటం వలన అతనేం చేసినా ఎన్టీఆర్ అడ్డు చెప్పలేదు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అవడంతో బాబీకి ఇది డూ ఆర్ డై పరిస్థితి. ఖచ్చితంగా విజయం కోసం శ్రమిస్తాడు.” అని ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతేకాదు జై లవకుశ చిత్రానికి పనిచేస్తున్న వారిలో ఎవరిని అడిగినా ఈ చిత్రం బ్లక్ బస్టర్ అని  అంటున్నారు. వీరిలో ఎవరి అంచనా కరెక్టో త్వరలోనే తెలియనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus