అన్న ఎన్టీఆర్.. తమ్ముడు చరణ్

  • March 10, 2018 / 02:44 PM IST

తెలుగు సినీ అభిమానుల కల నెరవేరబోతోంది. నందమూరి, మెగా హీరోలు కలిసినటిస్తే చూడాలని ఆశపడ్డ వారికీ పండుగ రానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించనున్న మల్టీస్టారర్ సినిమాకి పనులు జోరందుకున్నాయి. వీరిద్దరూ రీసెంట్ గా ఫోటో షూట్ కోసం విదేశాలకు వెళ్లారు. సినిమా స్టోరీ, కనీసం లైన్ కూడా బయటికి రాకుండా దర్శకుడు రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా బాహుబలి సినిమాల తర్వాత జక్కన్న చేస్తున్న ఈ సినిమా గురించి ఆరా తీయడానికి అనేకమంది ప్రయత్నిస్తున్నారు. వారు ఇదివరకే ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ అన్నదమ్ములుగా నటిస్తారని చెప్పారు. మరి ఎవరు అన్న? ఎవరు తమ్ముడు? అనే ప్రశ్నలకు ఈరోజు సమాధానం దొరికింది.

ఈ సినిమాలో అన్నయ్యగా ఎన్టీఆర్.. తమ్ముడిగా చరణ్ కనిపించనున్నట్లు సమాచారం. అలాగే ఇది బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ కాదని తెలిసింది. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకుంటున్నారు. నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమా కోసం 150 కోట్లు బడ్జెట్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం కంప్లీట్ చేసి బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. ఈ రెండు పూర్తి అయిన తర్వాత మల్టీస్టారర్ మూవీ పట్టాలెక్కనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus