టాలీవుడ్ లో ఇప్పుడు త్రివిక్రమ్ మంచి డిమాండ్ ఉన్న దర్శకుడు. స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో మూవీ తరువాత స్థాయి మరింత పెరిగింది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ హ్యాట్రిక్ మూవీ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీసిన విధానం చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోలను ఫిదా చేసింది. అందుకే ఎన్టీఆర్ అట్లీ, ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్స్ ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నా..వారిని కాదని త్రివిక్రమ్ కే ఓటేశాడు.
ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తరువాత తన 30వ చిత్రం త్రివిక్రమ్ తో ప్రకటించగా, మే నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని పలు భాషలలో విడుదల చేయాలని ప్రణాళికలు వేస్తున్నాడట. ఎటూ ఈ చిత్రం ఎన్టీఆర్ రాజమౌళి తో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ తరువాత విడుదల కానుంది. కాబట్టి ఎన్టీఆర్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు, పాన్ ఇండియా ఇమేజ్ రావడం ఖాయం.
రాజమౌళి సినిమా కాబట్టి కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న నేపథ్యంలో ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల చేయాలనుకుంటున్నారట. అందుకే ఆయన బాలీవుడ్ హీరోయిన్ తో పాటు క్యాస్ట్ సైతం పలు ఇండస్ట్రీలకు చెందిన వారిని తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఎన్టీఆర్ మార్కెట్ రీత్యా ఈజీగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందని ఆయన ఆలోచనట. మరి చూడాలి త్రివిక్రమ్ ప్రణాళిక ఎంత వరకు ఫలిస్తుందో… !