ఎన్టీఆర్ ‘లేకపోవడమే’ సినిమాకు ప్లస్!!!

శుక్రవారం విడుదలయిన నాగ్ ఊపిరి చిత్రం అనుకున్న దానికన్నా ఎక్కువగా భారీ హిట్ సాధించి విమర్శకుల ప్రశంసలతో పాటు, రికార్డ్ కలెక్షన్స్ తో హౌస్‌ఫుల్ గా ప్రదర్శింపబడుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో టాలీవుడ్ బాద్‌షా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కార్తి చేసిన పాత్రలో నటించాల్సి ఉంది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయన ఈ పాత్ర చెయ్యలేకపోయాడు. ఇక ఈ సినిమాలో కార్తి పాత్రకు మంచి మార్క్స్ పడుతున్నాయి. అమాయకత్వం, అల్లరి, కలగలిపిన నటనతో అన్నయ్యా అంటూ డిఫరెంట్ మాడ్యులేషన్ తో కార్తి చెప్పిన డైలాగ్స్ అందరికీ నచ్చి అసలు ఆపాత్ర కేవలం కార్తీ కోసమే పుట్టిందేమో అన్నంతగా కార్తీ జీవించేసాడు.

మరోపక్క తాజాగా ఒకానొక విశ్లేషణలో చెప్పినట్లు ‘ఎన్టీఆర్ ఏ సినిమా అయితే వదులుకుంటాడో అదే సినిమా భారీ హిట్ అవడం ఖాయం’ అని ఇప్పుడు అదే జరిగింది. ఊపిరి భారీ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇక మరో పక్క ఈ సినిమాపై అందరూ తమ అభిప్రాయాలను తెలిపారు కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికీ సినిమా గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే విశ్లేషకులు చెబుతున్న సమాచారం ప్రకారం…ప్రేక్షకుల నుంచి వస్తున్న వాదన ప్రకారం…ఊపిరిలో ఎన్టీఆర్ నటించకపోవడమే సినిమాకు పెద్ద ప్లస్ అని తెలుస్తుంది. ఎందుకంటే…ఇదే పాత్రను మొదట్లో అనుకున్న విధంగా జూనియర్ చేసి ఉంటే జూనియర్ కు ఉన్న ఇమేజ్ రీత్యా తమన్నాతో మరికొన్ని డ్యూయట్స్ మాస్ ప్రేక్షకుల కోసం కొన్ని ఫైట్స్, ఇంకా వీలుంటే మరొక ఐటమ్ సాంగ్ పెట్టి ఈ సినిమాను చెడగొట్టి ఉండేవారని ప్రేక్షకుల అభిప్రాయం. అందుకే ఎన్టీఆర్ లేకపోవడమే సినిమాకు ప్లస్ అన్న టాక్ బలంగా వినిపిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus