ఎన్టీఆర్ హోస్ట్ గా రియాలిటీ షో!

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ సీజన్ 1కి హోస్ట్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తనదైన యాంకరింగ్ తో ఎంటర్టైన్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మరోసారి హోస్ట్ గా కనిపించబోతున్నట్లు టాక్. జెమినీ టీవీలో ప్రసారం కానున్న ఓ రియాలిటీ షో కోసం అన్నపూర్ణలో భారీ సెట్ వేయబోతున్నారు. ఇప్పటికే రెండు ఫ్లోర్ లను బుక్ చేశారు. ఈ రియాలిటీ షోని ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 1 తరువాత తదుపరి సీజన్లలో కూడా ఎన్టీఆర్ కనిపిస్తాడని అభిమానులు భావించారు. కానీ ఆయనకి బదులుగా హీరో నాని.. ఆ తరువాత నాగ్ బిగ్ బాస్ షోని టేకప్ చేశారు. దీంతో ఇక ఎన్టీఆర్ ని హోస్ట్ గా చూడలేమేమోనని ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ హోస్ట్ ని హోస్ట్ గా పెట్టి ఓ రియాలిటీ షో ప్లాన్ చేస్తోంది జెమిని టీవీ.

త్వరలోనే ఈ షోకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో సమాంతరంగా ఈ రియాలిటీ షో చేస్తారని టాక్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus