ఫ్యాన్స్… డై హార్డ్ ఫ్యాన్స్ అని ఓ సినిమాలో డైలాగ్ ఉంది గుర్తుందా? తన అభిమానుల గురించి ప్రభాస్ చెప్పిన మాట ఇది. అయితే ఆయన ఆ సీన్లో చెప్పింది తన మీద వీరాభిమానం చూపిస్తున్నారు అనడానికి.. అయితే ఒక్కోసారి ఇలాంటి భయంకరమైన ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఆ సంఘటనను మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటే వణుకు పుడుతుంది కూడా. అలాంటి పరిస్థితే ఎదురైందట బాలీవుడ్ యువ కథానాయిక నుష్రత్ భరుచాకి. ఇటీవల ఆ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏమైందంటే…
గతంలో ఓ అభిమాని చేసిన పని వల్ల కంగారుపడ్డానని అని చెబుతూ నుష్రత్.. అతడు అలా ఎందుకు చేశాడనే విషయం తనకు తెలియదంటూ వివరించింది. ‘ఛత్రపతి’ రీమేక్ అయిన ‘ఛత్రపతి’లో కథానాయికగా నటించిన నుష్రత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్రేజీ ఫ్యాన్ మూమెంట్ గురించి చెప్పింది. ఓ రోజు ఓ అభిమాని తమ ఇంటి ముందు చాలా ఎక్కువ బహుమతులు పెట్టి వెళ్లిపోయాడట. అందులో రెండు ముక్కలైన లవ్ సింబల్ కూడా ఉందట. దీంతో ఎవరు, ఎందుకు పెట్టారు అనే ఆలోచన మొదలైందట.
అంతేకాదు ఆ లవ్ సింబల్లో ఒక ముక్క మీద నుష్రత్ పేరు.. మరో ముక్కపై ఆ అభిమాని పేరు రాసి ఉందట. దీంతో వాటిని చూసి నుష్రత్ షాక్ అయ్యిందట. అయితే ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని చెప్పింది నుష్రత్. అసలు అతడికి తమ ఇంటి అడ్రస్ ఎలా తెలిసిందోనని భయం వేసిందని నుష్రత్ చెప్పుకొచ్చింది. అంతే కాదు అదే ఇంటర్వ్యూలో ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇలాంటి అనుభవం గురించి మాట్లాడాడు.
నాకు కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఎదురైంది అని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓసారి సాయి శ్రీనివాస్ కారు ఎక్కుతుండగా ఓ వ్యక్తి ఫొటో కావాలంటూ కారులోకి వచ్చేశాడట. షాక్ నుండి తేరుకుని అతనిని ‘ఏం చేస్తున్నావ్’ అని అని అడగడంతో.. ‘ఒక్క ఫొటో ఇవ్వండి సర్’ అన్నాడు. దాంతో సెల్ఫీ ఇచ్చి.. కారు దిగమని చెప్పాను. ఆ క్షణం నేను చాలా షాకయ్యాను అని చెప్పాడు.