O Saathiya Review in Telugu: ఓ సాథియా సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 7, 2023 / 08:21 PM IST

Cast & Crew

  • ఆర్యన్‌ గౌరా (Hero)
  • మిస్తీ చక్రవర్తి (Heroine)
  • దేవీ ప్రసాద్, కల్పలత, ప్రమోదిని, అన్నపూర్ణమ్మ, శివన్నారయణ, చైతన్య గరికపాటి, క్రేజి ఖన్నా, బుల్లెట్‌ భాస్కర్, అంబరీష్‌ అప్పాజి తదితరులు (Cast)
  • దివ్య భావన (Director)
  • చందన కట్టా, సుభాష్‌ కట్టా (Producer)
  • విన్నూ (Music)
  • ఈ.జె.వేణు (Cinematography)

ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రేజీ సినిమాల్లో ‘ఓ సాథియా’ ఒకటి. ప్రచార చిత్రాలతో ఈ సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. ప్రేమకథా చిత్రాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ‘ఓ సాథియా’ కూడా ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ అని… తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది అని మేకర్స్ ముందు నుండీ చెబుతూ వచ్చారు. మరి వారి మాటల్లో ఎంత వరకు నిజం ఉందో? అసలు ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : వైజాగ్‌లో బి.టెక్‌ చదువుతూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు అర్జున్‌ (ఆర్యన్‌ గౌరా). ఇతను అనుకోకుండా తన కాలేజీలో చేరిన కీర్తి (మిస్తీ చక్రవర్తి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. మరోపక్క అర్జున్‌ అంటే అస్సలు పడని తన క్లాస్ మేట్ కూడా హీరోయిన్‌ ని ప్రేమిస్తున్నాను అంటూ ఆమె వెంటపడి ఆమెను విసిగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అర్జున్ తో అతను గొడవపడుతుంటాడు. కీర్తికి అర్జున్‌ పై కొంత పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది.

దీంతో అతని సలహా మేరకు అతనితో ప్రేమలో ఉన్నట్లు తిరుగుతుంది. దీంతో ఆమెను ప్రేమ అంటూ టార్చర్ పెడుతున్న వ్యక్తి దూరంగా ఉంటాడు. ఇదే క్రమంలో అర్జున్,కీర్తి ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత కీర్తికి ప్రపోజ్‌ చేయాలని అర్జున్ డిసైడ్ అవుతాడు. ఆమెకు ప్రపోజ్ చేయాలని అర్జున్ వెళ్తున్న టైంలో ఆమె ఇంటికి తాళం వేసి ఉంటుంది? ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తుంటుంది. అసలు కీర్తి ఏమైపోయింది? అర్జున్ ను ఆమె మోసం చేసిందా? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : అర్జున్ పాత్రలో ఆర్యన్‌ గౌరా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అతను పలికించిన హావభావాలు యూత్ కి కనెక్ట్ అవుతాయి. డాన్సులు కూడా బాగానే చేశాడు. మిస్తీ చక్రవర్తి లుక్స్ అలాగే పెర్ఫార్మన్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఈమె పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రిన్సిపల్‌ గా చేసిన శివన్నారాయణ తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పొచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు : ఈ రోజుల్లో ప్రేమ కథల్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇందులో ఉండే ఛాలెంజెస్ అందరికీ తెలుసు.కాబట్టి.. కొత్తగా చెప్పడానికి అంటూ ఏమీ ఉండదు. మొత్తం కథనాన్ని ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దడం పైనే ఫుల్ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి టఫ్ టాస్క్ ను దర్శకురాలు దివ్య భావన చాలా చక్కగా హ్యాండిల్ చేసిందని చెప్పాలి.తన మొదటి సినిమాతోనే తన టేకింగ్ తో మెప్పించి మంచి డైరెక్టర్ అనిపించుకుంది.

‘ఫస్ట్ లవ్ అనేది అందరి జీవితాల్లో చాలా స్పెషల్ అనే పాయింట్ ను’ ఎంతో అందంగా ప్రజెంట్ చేసింది దివ్య. సినిమాలో పాటలు కూడా ప్లెజెంట్ గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్, డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. కాకపోతే కాస్త పరిచయం ఉన్న నటీనటులను ఎంపిక చేసుకుని ఉంటే ఈ కథ త్వరగా జనాల్లోకి వెళ్ళుండేది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. చిన్న సినిమా కదా అని ఏ విషయంలోనూ తగ్గలేదు అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది.

విశ్లేషణ : కేవలం యూత్ ను మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే అంశాలు ‘ఓ సాథియా’ లో ఉన్నాయి. ఈ వీకెండ్ కి హ్యాపీగా థియేటర్ కి వెళ్లి చూడదగ్గ చిత్రం.

రేటింగ్ : 2.5/5

Click Here to Read in English

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus