Samantha: స్టార్ హీరోయిన్ సమంతకు అక్టోబర్ నెల మైనస్ అవుతోందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత తనకు ఏ మాత్రం సంబంధం లేని వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. సమంత విడాకులు తీసుకుని మూడు సంవత్సరాలు అవుతున్నా ఆమె విడాకుల గురించి ఏదో ఒక సందర్భంలో చర్చ జరుగుతోంది. విడాకులకు సంబంధించిన కారణాలను వెల్లడించడానికి చైతన్య సమంత ఆసక్తి చూపకపోవడంతో ఆమె విడాకులను టార్గెట్ చేస్తూ రాజకీయాలు జరుగుతున్నాయి.

Samantha

అయితే స్టార్ హీరోయిన్ సమంతకు అక్టోబర్ గండం ఉందని నెటిజన్ల నుంచి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ నెల సమంతకు అచ్చిరాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. 2017 సంవత్సరం అక్టోబర్ నెల 6వ తేదీన చైతన్య సమంతల వివాహం జరిగింది. అయితే 2021 సంవత్సరం అక్టోబర్ నెల 2వ తేదీన చైతన్య సమంత విడిపోవడం జరిగింది.

ఈ నెలలలోనే కొండా సురేఖ సమంత విడాకుల గురించి కామెంట్లు చేశారు. ఒక విధంగా స్టార్ హీరోయిన్ సమంతకు అక్టోబర్ గండం ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ నెల సమంతకు అచ్చిరాలేదని ఫ్యాన్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. సమంత త్వరలో మళ్లీ వరుస షూటింగ్ లతో బిజీ కానున్నారనే సంగతి తెలిసిందే. భవిష్యత్తు సినిమాలు సమంతకు భారీ విజయాలను అందించాలని అభిమానులు ఫీలవుతున్నారు. సమంత సైతం ఇకపై వేగంగా సినిమాల్లో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

సామ్ పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో ఆమె ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం. సామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సమంతకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సమంతకు 2025లో కెరీర్ పరంగా భారీ విజయాలు దక్కాలని పాన్ ఇండియా సినిమాలలో సైతం ఆమె నటించాలని అభిమానులు ఫీలవుతున్నారు. సమంతకు ఇండస్ట్రీ నుంచి కూడా పూర్తిస్థాయిలో సపోర్ట్ లభిస్తోంది.

‘దేవర’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus