Oke Oka Jeevitham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ఒకే ఒక జీవితం.. ఎప్పుడు.. ఎక్కడంటే?

దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్, రీతు వర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు. ఇక మదర్ సెంటిమెంటుతో సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే బాక్సాఫీస్ వద్ద ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను సోనీ లీవ్ కైవసం చేసుకుంది. ఇక ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మించారు. ఈ సినిమా థియేటర్ లో విడుదలైన 9 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనించింది. శతమానం భవతి సినిమా తర్వాత శర్వానంద్ కు సరైన హిట్ ఏ సినిమా రాలేదని చెప్పాలి అయితే చాలా కాలం తర్వాత ఈ సినిమా శర్వానందుకు ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

ఇక థియేటర్లో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ మీడియాలో ప్రసారం కానుంది. థియేట్రికల్ రన్ పూర్తి అయిన 6 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ రెండవ వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

ఇక త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను సుమారు 15 కోట్లకు సోనీ లీవ్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది.థియేటర్లో అందరిని మెప్పించిన శర్వానంద్ డిజిటల్ మీడియాలో ఎలా ప్రేక్షకులను సందడి చేస్తారో తెలియాల్సి ఉంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus