#NBK107: విజిల్స్ వేస్తూ బాలయ్యకు స్వాగతం చెప్పిన బామ్మ.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణకు ఫ్యాన్స్ లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. బాలయ్య ఒక్కో సినిమాకు పది నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటుండగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో జై బాలయ్య సినిమాలో నటిస్తున్నారు. మాస్ ప్రేక్షకుల్లో బాలయ్యను అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బాలయ్య గురించి తెలిసిన వాళ్లు ఆయనను భోళా మనిషి అని పిలుస్తారు.

ఆయన మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తారు. నిజ జీవితంలో బాలయ్య ఎంతో సింపుల్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. నిన్న కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర ఈ సినిమా షూటింగ్ జరగగా అన్ స్టాపబుల్ షో బాలయ్యను అభిమానులకు మరింత దగ్గర చేసింది. బాలయ్యను చూడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలయ్య ఫ్యాన్స్ జై బాలయ్య జైజై బాలయ్య అంటూ ఈలలు వేస్తూ గోలగోల చేశారు.

బాలయ్యను చూసి బామ్మ విజిల్ వేయడం గమనార్హం. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా గోపీచంద్ మలినేని ఈ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటానని నమ్ముతున్నారు. బాలయ్య సైతం ఈ సినిమా ఫలితం విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తున్నారనే సంగతితెలిసిందే.

బాలయ్య శృతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య వచ్చే నెల నుంచి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాతో బిజీ కానున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus