Olivia Morris, NTR: ఆ పాటను చూసి కన్నీళ్లు ఆగలేదు: ఒలివియా

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ RRR సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ అద్భుతమైన చిత్రం చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణ ప్రేక్షకుల నుంచి స్టార్ సెలబ్రిటీల కొరకు ప్రతి ఒక్కరు కూడా RRR ప్రతి ఒక్క సన్నివేశం కూడా అద్భుతంగా ఆకట్టుకుంటుంది అని చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ సీత పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

ఇక జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా బ్రిటిష్ పాత్రలో ఇంగ్లీష్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటించింది. సీత పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండడం కూడా చాలా విభిన్నంగా అందరికీ కనెక్ట్ అయింది. ఈ బ్యూటీ నటనకు ఓ వర్గం మాస్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఆమె తనలోని అమాయకత్వాన్ని ఆరాటాన్ని చూపించి చాలా సెన్సిటివ్ గా నటించింది అనే చెప్పాలి . అయితే రీసెంట్గా ఒలివియా ఒక మీడియా చానెల్ తో మాట్లాడుతూ సినిమాలో తను ఎక్కువగా ఆకట్టుకున్న పాటల గురించి వివరణ ఇచ్చింది.

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా అద్భుతంగా నటించారు అంటూ ముఖ్యంగా ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలతో తనకు కన్నీళ్ళు వచ్చాయి అని చెప్పింది. ముఖ్యంగా కొమరం భీముడు పాటలో ఎన్టీఆర్ భావోద్వేగమైన ఆతృత ను చూసి చలించిపోయాను అంటూ అతని నటన చాలా అద్భుతం అని తెలియకుండానే కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చాయని కూడా ఒలివియా తెలియజేసింది. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం తాను హైదరాబాదులో దాదాపు 20 రోజులపాటు ఉన్నాను

అంటూ షూటింగ్లో కాస్త ఎక్కువ బిజీగా ఉండటం వలన హైదరాబాద్ మొత్తం చూడలేకపోయాను అని చెప్పింది. అంతే కాకుండా ఈ సినిమాలో నాటు నాటు స్టెప్ తన బాయ్ ఫ్రెండ్ ట్రై చేసే ప్రయత్నం చేశాడు అనే ఓలీవియా వివరణ ఇచ్చింది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus