ఒలింపిక్ పతక విజేత సింధుకి నచ్చిన హీరోలు ఎవరంటే ?

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు రియో ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి భారతీయుల అందరి గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఈ తెలుగు తేజానికి ప్రపంచంలోని అనేక దేశాల్లో అభిమానులు ఉన్నారు. ప్రతిష్ఠాత్మక ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) కోసం సింధు ప్రస్తుతం ఢిల్లీలో ఉంది. ఈ సీజన్‌లో సింధు చెన్నై స్మాషర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. “బ్యాడ్మింటన్‌ ను సెలక్ట్ చేసుకున్న సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాను. తల్లిదండ్రుల సాయంతో వాటిని ఎదిరించగలిగాను. నాకు ఏది కావాలంటే అది సమకూర్చారు. ఏదైనా సరే… వారి కష్టం వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. నా కోసం వారు అన్ని వదులుకున్నారు. ఎన్నో త్యాగాలు చేశారు.

నా చిన్న తనంలో ప్రాక్టీస్‌ కోసం 47 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. అలాంటి సమయంలోనూ నాకు పేరెంట్స్ సపోర్ట్ మరిచిపోలేనిది” అని సింధు వివరించింది. సినిమాలు చూస్తుంటారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. “‘ఖాళీ సమయంలో సినిమాలకు వెళ్తా. థియేటర్‌లో లైట్లన్ని తీసేశాక వెళ్లి.. మళ్లీ సినిమా అయ్యాక ఆ లైట్లు వేసేలోగా బయటికి వచ్చేస్తా. తెలుగులో మహేష్‌, ప్రభాస్‌, బాలీవుడ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, దీపిక పదుకొణె, అనుష్క శర్మలు అంటే ఇష్టం” అని సింధు చెప్పింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus