టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. సమంత సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోండగా సమంత రెమ్యునరేషన్ ను మళ్లీ పెంచేశారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సమంత ప్రస్తుతం సినిమాను బట్టి 8 కోట్ల రూపాయల రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. 3 కోట్ల రూపాయల నుంచి 8 కోట్ల రూపాయల రేంజ్ లో సమంత పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.
సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. సమంత నటించిన యశోద వచ్చే 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. శాకుంతలం రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉండగా ఈ ఏడాదే ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న సమంత మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు.
సమంత సినిమాసినిమాకు తన రేంజ్ పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్త తరహా కథాంశాలకు సమంత ఎక్కువగా ఓటేస్తున్నారు. సమంతకు స్టార్ హీరోలకు జోడీగా నటించే ఆఫర్లు సైతం వస్తుండగా ఆ ఆఫర్ల విషయంలో సమంత త్వరలో కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
సమంత కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమంత నటిస్తున్న శాకుంతలం, ఖుషి సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. సమంత బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్ లపై కూడా దృష్టి పెడుతున్నారు. వయస్సు పెరుగుతున్నా సమంతను అభిమానించే అభిమానుల సంఖ్య తగ్గడం లేదు. తెలుగు సినిమాలకు సమంత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. చైతన్యతో విడిపోయినా సమంతకు సినిమా ఆఫర్లు మాత్రం తగ్గకపోవడం గమనార్హం.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!