Taapsee: అప్పుడు డబ్బు కోసం అలా.. ఇప్పుడు పేరొచ్చాక ఇలా..!

  • April 20, 2023 / 04:22 PM IST

సౌత్ సినిమాల ద్వారా హీరోయిన్లుగా పరిచయమైన వాళ్ళు.. బాలీవుడ్లో ఒకటి రెండు అవకాశాలు రాగానే అక్కడి మీడియా ముందు సౌత్ ఫిలిం మేకర్స్ ను చులకన చేసి మాట్లాడటం అనేది కొత్త విషయం ఏమీ కాదు. ఆ లిస్ట్ లో చాలా మంది భామల్ని చూశాం. అందులో తాప్సి ఒకరు. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సి .. ఆ సినిమా పాటల విషయంలో దర్శకుడు చాదస్తానికి పోయి తనని చిత్ర హింసలకు గురిచేసినట్లు అక్కడి మీడియా ముందు మాట్లాడింది.

దీంతో మనవాళ్ళు ఓ రేంజ్లో తాప్సిని (Taapsee) ట్రోల్ చేశారు. దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఈ విషయంలో లైట్ తీసుకున్నట్లు చెప్పి ఆ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టారు. అయినా సరే తాప్సి మరోసారి దక్షిణాది సినిమా పై నోరు పారేసుకుంది. ‘సౌత్ లో నా టాలెంట్ ని ఎవరూ గుర్తించలేదు.. నా గ్లామర్ ను మాత్రమే వాడుకున్నారు’ అన్నట్టు ఆమె కామెంట్ చేసింది.

‘నటించే పాత్రలు కాకుండా రొటీన్ గ్లామర్ పాత్రలు ఇచ్చారు’ అంటూ తనలోని నటిని ఎలా వాడుకోవాలో సౌత్ ఫిలిం మేకర్స్ కు తెలీలేదు అంటూ విమర్శించింది. నిజానికి తాప్సి అంత గొప్ప నటేమీ కాదు. ఒకవేళ ఆ టైంలో అలాంటి రోల్స్ నచ్చకపోతే చేసుండకుండా ఉండాల్సింది. అప్పుడు డబ్బు కోసం చేసేసి..

ఇప్పుడు పేరొచ్చాక ఇలాంటి తనని పైకి తీసుకొచ్చిన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని తక్కువ చేయడం ఎందుకు. తాప్సి మాత్రమే కాదు మొన్నటికి మొన్న రష్మిక కూడా సౌత్ సినిమాల్లోని పాటల గురించి చులకనగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus