Kushi Re-Release: పవన్ కళ్యాన్ ఖుషి రిలీజ్ ఎప్పుడంటే..!

  • October 10, 2023 / 06:06 PM IST

ఈ మధ్య కాలం లో మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ రిలీజ్ ట్రెండ్ లో ఇండస్ట్రీ హిట్ లాంటి సినిమా ఖుషి. ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఏ సినిమా కూడా బ్రేక్ చెయ్యలేకపోయింది. దాదాపుగా అందరి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ ఒక్క సినిమా కూడా ఈ చిత్రానికి దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది.

మొదటిరోజు నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో దాదాపుగా 7 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి బరిలోకి దిగిన సింహాద్రి, బిజినెస్ మెన్ మరియు గుడుంబా శంకర్ చిత్రాలు ఖుషి రికార్డు ని బ్రేక్ చెయ్యడం లో విఫలం అయ్యాయి. ఇప్పుడు ఆ ఖుషి రికార్డు ని బ్రేక్ చెయ్యడానికి మళ్ళీ ఖుషి (Kushi) చిత్రం విడుదల అవ్వబోతుంది.

అక్టోబర్ 11 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పాతికేళ్ళు అవుతుంది. ప్రతీ ఏడాది అక్టోబర్ 11 వ తేదీని ‘వరల్డ్ పవనిజం డే’ అని పిలుస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా ఖుషి చిత్రం ని మరోసారి రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ముందుగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే సంధ్య 70 ఎంఎం థియేటర్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించనున్నారు.

ఆ తర్వాత వరుసగా షోస్ యాడ్ చేసుకుంటూ పోతారట. కాకపోతే ఇది లిమిటెడ్ రిలీజా, లేదా భారీ రిలీజా అనేది తెలియాల్సి ఉంది. లిమిటెడ్ రిలీజ్ అయితే ఖుషి గత సంవత్సర రికార్డు ని కొట్టడం కష్టమే, అదే భారీ రిలీజ్ అయితే కచ్చితంగా మార్జిన్ తో కొడుతుందని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus