ఫ్యాన్స్ కి కావలసింది ఎప్పుడిస్తావ్ మహేష్..?

మహేష్ చేస్తున్న సినిమా ప్రకటనలు ఆయన వీరాభిమానులకు రుచించడం లేదు. వారికి కావలసిన ప్రకటన మహేష్ నుండి రాకపోవడమే అందుకు కారణం. టాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాన్స్ బేస్ కలిగిన హీరో మహేష్ ఓ పాన్ ఇండియా లెవల్ మూవీ చేయాలని, వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి తో ఆ కల సాకారం అవుతుందని వారు భావించారు. ఐతే వాళ్లిద్దరూ కలిసి పనిచేయడం ఇప్పట్లో జరిగేటట్టు లేదు. బాహుబలికి ముందే మహేష్ తో రాజమౌళి సినిమా చేయాల్సింది. మహేష్ తో సినిమా కోసం ఓ నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకున్నానంటూ రాజమౌళి స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. కారణాలేమైనా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

Sarileru Neekevvaru Movie New Still

ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రం తరువాతైనా మహేష్ ఓ పెద్ద స్టార్ డైరెక్టర్ తో పాన్ ఇండియా మూవీ చేస్తారు అనుకున్నారందరూ. అనూహ్యంగా వంశీ పైడిపల్లి తో సినిమా ప్రకటించి వారి ఆశలపై నీళ్లు చల్లారు. అలాగే కేజీఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎటువంటి సినిమాకు సంబంధించిన ఒప్పందం జరగలేదు అన్నారు. మహేష్ ఇచ్చిన ఈ స్టేట్ మెంట్స్ తో ఆయన నుండి ఇప్పట్లో పాన్ ఇండియా మూవీ వచ్చే దాఖలాలు లేవని అర్థమైపోయింది. మరో వైపు దర్శకుడు వంశీ పైడిపల్లి పనితనం పై కూడా వారు అంత సంతృప్తి కరంగా ఏమిలేరు. ఆయన తీసిన మహర్షి మూవీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. ఒక్క నైజాంలో మాత్రమే ఈ చిత్రం రికార్డ్ వసూళ్లు రాబట్టింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకుడితో మూవీ ప్రకటించినా వారు కొంత మేర సంతృప్తి వ్యక్తం చేసేవారు. ఏదిఏమైనా మహేష్ ని పలుభాషలలో విడుదలయ్యే భారీ పాన్ ఇండియా మూవీలో చూడాలని ఎదురు చూస్తున్న అభిమానులకు మళ్ళీ నిరాశే ఎదురైంది.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus