Meera Jasmine, Balakrishna: బాలయ్యతో రొమాన్స్ కు ఓకే చెబుతుందా..?

  • February 16, 2022 / 05:40 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుందని.. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని వార్తలొస్తున్నాయి. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు బాలయ్య. మరో నాలుగు నెలల తరువాత వీరి కాంబోలో సినిమా పట్టాలెక్కనుంది.

Click Here To Watch

దీనికోసం స్టార్ క్యాస్ట్ ను ఎన్నుకుంటున్నారు. సినిమాలో కీలకమైన పాత్ర ఉంది. అది బాలయ్య కూతురు క్యారెక్టర్. కథ మొత్తం దాని చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్ర కోసం ‘పెళ్లి సందడి’ హీరోయిన్ శ్రీలీలను తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ పాత్ర కోసం అమ్మడు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. ఇప్పటికే వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టిల సరసన రెండు సినిమాలు ఓకే చేసింది. వీటి కోసం రూ.72 లక్షల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

ఇప్పుడు బాలయ్య సినిమాకి అంతకుమించి అడుగుతుందట. ప్రస్తుతం నిర్మాతలు ఆమెతో బేరసారాలు సాగిస్తున్నారు. అలానే బాలయ్య సరసన నటించే హీరోయిన్ కోసం కూడా వెతుకులాట మొదలుపెట్టారు. ఈ మధ్యనే కొత్త మేకోవర్ తో గ్లామరస్ గా తయారైన సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ను ఇప్పుడు బాలయ్యకి జోడీగా తీసుకోవాలనుకుంటున్నారట. ఒకప్పుడు మీరా జాస్మిన్ కి మంచి క్రేజ్ ఉండేది. ఆ తరువాత పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.

ఇప్పుడు రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తోంది. గతంలో ఈమె బాలయ్యతో కలిసి ఓ సినిమా కూడా చేసింది. మరిప్పుడు ఛాన్స్ వస్తే ఒప్పుకుంటుందో లేదో చూడాలి!

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus