అభిమానులకి ఇది టెన్షన్ పెట్టే వార్తే అయినప్పటికీ… తప్పదు నిజమే మరి..! పవన్ కళ్యాణ్ మరోసారి అనారోగ్యం పాలయ్యాడు. ఎన్నికల సమయంలో ‘డీ హైడ్రేషన్’ తో అనారోగ్యం పాలయ్యాడు పవర్ స్టార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కువ తిరగడం వల్ల అలా జరిగింది. ఈసారి మాత్రం వెన్ను నొప్పితో బాద పడుతున్నట్టు తెలుస్తుంది. విజయవాడలో ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు పవన్ కళ్యాణ్.
కానీ వెన్నునొప్పితో బాదపడుతుండడంతో మీడియా సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్టు… తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు పవన్ కళ్యాణ్. ఇక ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు అని సన్నిహితులు చెబుతున్నారు.