Bigg Boss 7 Telugu: ఆటలో పౌల్ గేమ్ ఆడుతున్న రతిక..! ట్రోల్స్ చేస్తున్న ఆడియన్స్..! లైవ్ లో జరిగింది ఇదే..?

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇందులో హాల్ ఆఫ్ బాల్స్ అనే గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన పైప్ లోనుంచీ వచ్చే బాల్స్ ని పార్టిసిపెంట్స్ వారి స్యాక్స్ లో నింపుకుని దాచుకోవాలి. ఈ స్యాక్స్ కి అంటే సంచీని వేరే ఎక్కడా దాచేందుకు చూడకూడదు. అలాగే, అందులోని బాల్స్ ని కూడా వేరే ఎక్కడా దాచేందుకు ప్రయత్నించకూడదు. అయితే, పార్టిసిపెంట్స్ ఇక్కడే అతి తెలివి వాడారు. ముఖ్యంగా రతిక బిగ్ బాస్ టాస్క్ ని సరిగ్గా అర్ధం చేస్కోలేకపోయింది.

స్యాక్స్ లో నుంచీ బాల్స్ ని తీసి సోఫా మద్యలో అలాగే పిల్లో కవర్స్ లో దాచేసింది. దీంతో టీమ్ మొత్తం ఇప్పుడు సూప్ లో పడింది. అలాగే, వంటిట్లో టమోటాలు, ఉల్లిపాయలతో బాల్స్ ని రీప్లేస్ చేసి స్యాక్స్ నింపాలని చూసింది. దీంతో ఆడియన్స్ కి మరోసారి అడ్డంగా దొరికిపోయింది. ఎందుకంటే., బిగ్ బాస్ హౌస్ లో గతవారం రతిక శోభాశెట్టిని , ప్రియాంకని పౌల్ గేమ్ ఆడారని అమర్ కి హెల్ప్ చేశారని నిందిస్తూ నామినేషన్ చేసింది.

తను కూడా అమర్ కి హెల్ప్ చేసినా కూడా అది పౌల్ కాదని అది కేవలం హెల్ప్ మాత్రమే అని అడ్డంగా వాదించింది. ఇప్పుడు ఇలా పౌల్ గేమ్ ఆడుతూ అడ్డంగా దొరికిపోయింది రతిక. దీంతో ఆడియన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. మనం చేస్తున్నది ఏమిటి రతిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, అసలు ఆడియన్స్ వద్దని ఎలిమినేట్ చేసిన రతిక మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. రతికని ఆడియన్స్ కావాలనే హౌస్ నుంచీ వెళ్లగొట్టారు.

దీంతో రతిక ఎలిమినేట్ అయ్యింది. కానీ, బిగ్ బాస్ రీ ఎంట్రీ లో భాగంగా ఉల్టా పుల్టా అంటూ హౌస్ మేట్స్ మద్దతు లేకుండానే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయినా సరే తన పద్దతి మారుతుందని అనుకున్నారు. కానీ ఇలా తన నామినేషన్ ని తానే డిపెండ్ చేస్కోలేక పౌల్ గేమ్ ఆడుతుంటే మాత్రం ఆడియన్స్ తట్టుకోలేకపోతున్నారు. రతికని తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగే ఈవారం గేమ్ ఆడితే రతిక ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. మరి (Bigg Boss 7 Telugu) ఈవారం సేఫ్ అవుతుందా లేదా అనేది చూడాలి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus