టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ గా పదేళ్ల వరకు ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ అందుకున్న సమంత, అక్కినేని నాగచైతన్య ఇటీవల వారి బంధానికి ముగింపు కార్డు వేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలు పదేళ్ల వరకు ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ జంట ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే విషయం పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇక అసలు కారణాలు ఏమిటి అనేది ఇంతవరకు బయటకు రాలేదు.
సమంత నాగచైతన్య కూడా ఇష్టపూర్వకంగా ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు సమంత సోషల్ మీడియాలో ఎప్పటిలాగే చురుగ్గా కనిపిస్తోంది. కానీ ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు మాత్రం ఏదో తెలియని ఆవేదన కల్పిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక చాలా రోజుల క్రితమే సమంత సోషల్ మీడియాలో తన పేరు పక్కన అక్కినేని పేరును తీసివేసిన విషయం తెలిసిందే. కేవలం S అని మాత్రమే పెట్టుకోవడంతో అప్పటి నుంచే అనేక రకాల కథనాలు వచ్చాయి.
ఇక ఇప్పుడు సమంత గతంలో పెళ్లికి ముందు ఉన్నటునవంటి సమంత రుత్ ప్రభు అనే పేరును సెట్ చేసుకుంది. ఈ విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సమంత భరణం తీసుకోవడంలో కూడా వెనుకడుగు వేసినట్లు ఒక టాక్ అయితే వస్తోంది.