సీఎంలను సన్మానించుకోవాలి… మన కష్టాలు చెప్పాలి… మన ఇబ్బందులు చర్చించాలి… మనకు అవసరమైనవి అడగాలి… అప్పుడు వాళ్లు మనకు సాయం చేస్తారు! – ఈ మాటలు ఎక్కడో వినినట్లు ఉంది కదా. మోహన్‌బాబు స్పీచ్‌లను, సోషల్ మీడియా పోస్టులను ఫాలో అయ్యేవారికి వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల సమస్య గురించి చర్చలు నడుస్తున్నప్పుడు మోహన్‌బాబు ఈ మాట అన్నారు. అయితే ఇప్పుడు ఆ మాటల్ని టాలీవుడ్ నిజం చేయబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరలను సవరిస్తూ… ప్రభుత్వం కొత్తగా జీవో జారీ చేసింది. ప్రభుత్వ పెద్దలు, సినిమా పెద్దలు కలసి చర్చించుకొని కొత్త ధరలకు ఓ రూపు ఇచ్చారు. దీంతోపాటు చిన్న సినిమాలకు ఐదో షో, పెద్ద సినిమాలకు (షరతులు ఉన్నాయ్) టికెట్ రేటు పెంపు లాంటి సౌకర్యాలను ప్రభుత్వం ఇచ్చింది. దీని వల్ల సినిమా పరిశ్రమకు చాలా ఉపయోగం అని అందరూ అంటున్నారు. అయితే ఇన్నాళ్లు ఎందుకు పెంచలేదు అనే ప్రశ్న ఉంది. ఆ విషయం పక్కనపెడితే…
పరిశ్రమకు మంచి చేసిన ఏపీ సీఎం జగన్‌ను మరోసారి కలవాలని టాలీవుడ్ పెద్దలు అనుకుంటున్నారట. నిజానికి చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్‌బాబు, కొరటాల శివ తదితరులు వెళ్లి సీఎం జగన్‌ను కలసిన తర్వాత టికెట్ ధరల ప్రాసెస్ స్పీడ్‌గా నడిచిందంటారు. ఇప్పుడు వాళ్లంతా కలసి… మరికొంతమందిని తీసుకెళ్లి సీఎం జగన్‌ను కలవనున్నారట. ఈ క్రమంలో జగన్‌కు చిన్నపాటి సన్మానం చేయాలని కూడా అనుకుంటున్నారట. సీఎం జగన్ నుండి తేదీ విషయంలో స్పష్టత వచ్చేస్తే… మిగిలిన పనులు చూడాలని అనుకుంటున్నారట.
అయితే ఇప్పుడు సీఎంను కలవడానికి ఎవరెవరు వెళ్తారు అనేది తెలియాల్సి ఉంది.మరోవైపు నాగార్జున అనివార్య పరిస్థితుల వల్ల అప్పుడు వెళ్లలేకపోయారు. ఈసారి ఆయన పక్కా. మమ్మల్ని పిలవలేదు, పిలిస్తే వచ్చేవాళ్లమే అంటూ చాలామంది ఈ మధ్య కామెంట్లు చేశారు. వాళ్లంతా ఇప్పుడొస్తారా? మోహన్‌బాబు చెప్పినట్లు సీఎం జగన్‌ను గౌరవించుకొని, వరాలు కోరతారా అనేది చూడాలి. ఎలాగూ వైఎస్ జగన్ వైజాగ్ రండి స్థలాలిస్తా… జూబ్లీహిల్స్ చేద్దాం అన్నారు. ఈలెక్కన ఆ లెక్కలు కూడా చర్చకు వస్తాయేమో.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!