Venkatesh, Trisha: తెలుగులో మళ్ళీ బిజీ అవుతున్న త్రిష..!

  • February 22, 2024 / 12:56 PM IST

త్రిష ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్. ‘వర్షం’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘అతడు’ వంటి సినిమాలతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈమెకు బోలెడన్ని ఛాన్సులు లభించాయి. సీనియర్ హీరోలందరి సరసన ఆడిపాడింది. అయితే వెంకటేష్ తో ఈమె ట్రాక్ రికార్డు బాగుంది. ఈ కాంబోలో ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ ‘నమో వెంకటేశా’ ‘బాడీ గార్డ్’ వంటి హిట్ సినిమాలు వచ్చాయి.

ఆ తర్వాత త్రిష (Trisha) తెలుగులో సినిమాలు పెద్దగా చేసింది లేదు.2016 లో వచ్చిన ‘నాయకి’ మినహా ఆమె తెలుగులో చేసిన సినిమా అంటూ ఏమీ లేదు. అయితే ఇంత కాలానికి ఆమె మళ్ళీ తెలుగులో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తుంది. ఇప్పటికే చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోసియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ లో ఈమె హీరోయిన్ గా ఎంపికైంది. ఇటీవల ఈమె షూటింగ్లో జాయిన్ అయిన విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు మరో సీనియర్ హీరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోంది. దిల్ రాజు దీనికి నిర్మాత. ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందే చిత్రం. ఇందులో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసుకున్నారని సమాచారం. అధికారిక ప్రకటన అయితే ఇంకా ఇవ్వలేదు. కానీ ఆమె దాదాపు ఫైనల్ అయినట్టేనట..!

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus