ఒకప్పుడు తెలుగు, తమిళ్, హిందీ వంటి పలు భాషల్లో నటించి సూపర్ క్రేజ్ సంపాదించిన సినీనటి నగ్మా ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పాల్గొనగా చేదు అనుభవం మిగిలింది. అయితే శివపురి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమెని చూసి అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. ఇక్కడ అభిమానుల కంటే పార్టీ కార్యకర్తలే అత్యుత్సహం చూపెట్టడం విశేషం.
ఇలా నగ్మా ని చూసి అందరు ఎగబడటంతో అందులో ఇద్దరు పార్టీ కార్యకర్తలు స్టేజ్ పైన ఏకంగా కొట్టుకోవడంతో నగ్మా వారిని హెచ్చరించి పరిస్థితిని కొంచం కంట్రోల్ చేసి ఆ తరువాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడింది. సభాస్థలికి సరైన సమయానికి రాలేనందున నన్ను అందరు క్షమించాలని, శివరాజ్ సింగ్ చౌహాన్ కార్యకర్తలు నన్ను అడ్డుకోవడం వలనే ఆలస్యం అయిందంటూ చెప్పింది. ఇలా ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో కూడా ఆమెకి చాలా చేదు అనుభవాలే జరిగాయి. ఒకప్పుడు ఒక పార్టీ నేత ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడనే వార్తా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.