Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ రెండు క్రేజీ అప్డేట్స్ ఎప్పుడంటే?

స్టార్ హీరో బాలకృష్ణ (Nandamuri Balakrishna)  , స్టార్ డైరెక్టర్ బాబీ (Bobby)  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా టైటిల్, టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా బాలయ్య పుట్టినరోజున ఈ రెండు క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని సమాచారం. ఈ రెండు అప్ డేట్స్ వస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని తెలుస్తోంది. జూన్ నెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.

బాలయ్య పుట్టినరోజున బాలయ్య కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్యతో సినిమాలను నిర్మించడానికి పోటీ పడుతున్న నిర్మాతల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న బాలయ్య తనతో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది హీరోలు మాస్ కథాంశాలలో నటించడం లేదు.

బాలయ్య మాత్రం మాస్ కథాంశాలను ఎంచుకోవడం ఈ హీరోకు ఎంతగానో ప్లస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్యకు జోడీగా నటించడానికి చాలామంది హీరోయిన్లు ఆసక్తి చూపిస్తున్నారు. బాలయ్య బాబీ కాంబో మూవీలో మెయిన్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. బాలయ్య పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఒక్క సినిమా హిట్టైనా బాలయ్య రేంజ్ మారిపోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు బాలయ్య సినిమాలను ఆదరిస్తున్నారు. బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా సినిమా సినిమాకు లుక్ విషయంలో సైతం బాలయ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలయ్యతో మళ్లీమళ్లీ వర్క్ చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus