రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ని ఎదుర్కొన్న ఏకైక హీరో ప్రభాస్

Advertisement

దర్శక ధీరుడు రాజమౌళితో మూవీ చేసే అవకాశం రావడం అనేది ఏ హీరోకైనా కల అని చెప్పాలి. ఎందుకంటే ఆయనతో మూవీ అంటే రికార్డు బ్రేకులే, హిట్ ప్లాప్ ల ప్రస్తావన ఉండదు. సదరు హీరో ఖచ్చితంగా అతని పేరుమీద కొన్ని రికార్డ్స్ నమోదు చేసుకుంటారు.భారీ చిత్రాలు చేసే రాజమౌళి కెరీర్ మొదలై దాదాపు 20ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ళలో రాజమౌళి చేసింది కేవలం 11 చిత్రాలు మాత్రమే. ఆ పదకొండు చిత్రాలలో కూడా 3 ఎన్టీఆర్ తో, 3 ప్రభాస్ తో చేశారు.

సునీల్, నాని, రవితేజ, రాంచరణ్, నితిన్ లతో ఒకో మూవీ చొప్పున చేశారు. రాజమౌళి మూవీతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన ఈ హీరోలందరూ తమ నెక్స్ట్ మూవీ ప్లాప్ నమోదు చేశారు. ప్రతి హీరోని రాజమౌళి మూవీ తరువాత ప్లాప్ పేస్ చేయాలనే సెంటిమెంట్ తప్పకుండా ఫాలో అయ్యింది. ఒక్క ప్రభాస్ విషయంలో అది కూడా సాహూ మూవీ విషయంలో ఇది ఫెయిల్ అయ్యింది. బాహుబలి తరువాత ప్రభాస్ సాహో అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నిజానికి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఐతే తెలుగుతో పాటు సౌత్ భాషలలో సాహో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, భారీ వసూళ్లు దక్కించుకుంది. ఐతే మూవీ అధిక ధరలకు అమ్మిన నేపథ్యంలో కొన్ని చోట్ల నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. కానీ బాలీవుడ్ లో సాహో సూపర్ హిట్ గా నిల్చింది. 150కోట్లకు పైగా వసూళ్లతో బయ్యర్లకు లాభాలు పంచింది. ఈ నేపథ్యంలో రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ ని ఎదుర్కొన్న ఏకైన హీరో ప్రభాస్ అని చెప్పాలి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus