Oopiri Collections: ‘ఊపిరి’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

అక్కినేని నాగార్జున (Nagarjuna), కార్తీ (Karthi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఊపిరి’ (Oopiri). వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఈ సినిమాకు దర్శకుడు. ‘పీవీపీ సినిమాస్’ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి (Potluri Vara Prasad), కెవిన్ అన్నే ఈ చిత్రాన్ని నిర్మించారు. 2016 మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ది ఇన్-టచబుల్స్’ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా రూపొందింది ‘ఊపిరి’ సినిమా. అయితే దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను బాగా ఓన్ చేసుకుని డైరెక్ట్ చేశాడేమో అనిపిస్తుంది.

Oopiri Collections:

క్లాస్ సినిమా కదా స్లో ఉంటుంది అనే ఫీలింగ్ రాకుండా స్క్రీన్ ప్లే బాగా మ్యాజిక్ చేసింది. అందుకే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలిచింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 8.45 cr
సీడెడ్ 3.25 cr
ఉత్తరాంధ్ర  3.03 cr
ఈస్ట్  1.95 cr
వెస్ట్  1.31 cr
గుంటూరు  2.14 cr
కృష్ణా  1.73 cr
నెల్లూరు  0.85 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 22.71 cr
తమిళనాడు  14.91 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  6.30 cr
ఓవర్సీస్  8.38 cr
వరల్డ్ వైడ్ టోటల్ 52.30 cr

‘ఊపిరి’ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ఏకంగా రూ.52.3 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.8.3 కోట్లతో ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలిచింది.

మొత్తానికి దిగొచ్చి సారీ చెప్పిన నటకిరీటి.. వీడియో వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus