‘ఊపిరి’కి సీక్వెల్..!

  • April 4, 2016 / 06:55 AM IST

నాగార్జున, కార్తి, తమన్నాలు ప్రధాన నటించిన చిత్రం ‘ఊపిరి’. ప్రెంచ్ చిత్రం ది ఇన్ టచబుల్స్ చిత్రానికి తెలుగు రీమేక్ గా వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని తోజా పేరుతో తమిళంలో కూడా తెలుగుతో పాటే ఒకే సారి విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అమితమైన ఆదరణ లభిస్తుండటంతో.. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు చిత్ర బృందం. ఊపిరి విడుదలకు ముందు జరిగిన ఓ ఇంటర్వ్యూ లో నాగార్జున తో కలిసి ఊపిరి సీక్వెల్ లో డాన్స్ చేస్తానని తమన్నా చెప్పగా.. ఇప్పుడు చెన్నై లో జరిగిన తోజా సక్సెస్ మీట్ లో నాగార్జున ఊపిరి సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశారు. కాగా సంక్రాంతి కానుకగా విడుదలైన సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు వస్తుండగా.. ఇప్పుడు ఊపిరి చిత్రానికి కూడా సీక్వెల్ రానుండటం విశేషం. ఊపిరి సీక్వెల్ మాత్రం 2017 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus