మ్యూజిక్ లవర్స్ అందరికీ వింటేజ్ ఫీల్స్ ఇచ్చేది ఇళయరాజా, కీరవాణి, ఏ.ఆర్.రెహమాన్ అనే చెప్పాలి. ఇద్దరూ కూడా ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. ఒకానొక టైంలో స్టార్ స్టేటస్ అనుభవించినవారే. కాకపోతే కాలక్రమేణా వీళ్ళ హవా తగ్గింది అనే కామెంట్స్ మొన్నామధ్య ఎక్కువగా వినిపించాయి. ‘కీరవాణి.. దర్శకుడు రాజమౌళి సినిమాలకి తప్ప వేరే సినిమాలకి ఇంట్రెస్టింగ్ గా పనిచేయడం లేదు’ అని చాలా మంది విమర్శించారు. కానీ ‘నా సామి రంగ’ ‘విశ్వంభర’ వంటి పెద్ద సినిమాల ఛాన్సులు అందుకుంటూ కీరవాణి బిజీగానే గడుపుతున్నారు.
మధ్యలో ‘పెళ్ళిసందD’ అనే సినిమాకి సంగీతం అందించారు. ఆ సినిమా పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. కానీ కొంత కాలంగా ఎక్కడ చూసినా అనిరుధ్, తమన్ వంటి సంగీత దర్శకుల పాటలు తప్ప వేరే సంగీత దర్శకుల పాటలు వినిపించడం లేదు. కీరవాణి, రెహమాన్ వంటి ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగీత దర్శకుల పాటలు అయితే కనుమరుగు అయిపోతున్నాయి అనే కామెంట్స్ కూడా వినిపించాయి.
అయితే ఇప్పుడు వీళ్ళ హవా మళ్ళీ మొదలైనట్టు కనిపిస్తుంది. తాజాగా ఏ.ఆర్.రెహమాన్ సంగీతంలో రూపొందిన ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. ‘చికిరి చికిరి’ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అంటే ఈ మధ్య చాలా మంది స్కిప్ చేసే పరిస్థితి ఏర్పడింది.
అలాంటి టైంలో ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ కి దక్కిన ఆదరణ చూస్తుంటే.. ఆయన కెపాసిటీ తగ్గలేదు అని స్పష్టం చేసినట్టు అయ్యింది. సరిగ్గా కీరవాణి కూడా ఇంతే. అయితే తాజాగా మహేష్ బాబు- రాజమౌళి సినిమాకు సంబంధించి ఓ పాట విడుదలైంది. ఇది ఇంటర్నెట్ ని షాక్ చేస్తుంది అనే చెప్పాలి. ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్టులో ఈ పాట కూడా చేరిపోయింది. ఇలా కీరవాణి. రెహమాన్..ల హవా మళ్ళీ మొదలైంది అనే చెప్పాలి.