విజయ్ దేవరకొండ హీరోగా ‘కింగ్డమ్’ సినిమా రూపొందింది. అనేక సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఫైనల్ గా జూలై 31న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదట సోషల్ మీడియాలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూస్ పర్వాలేదు అనిపించే విధంగా వచ్చాయి. అందువల్ల వీకెండ్ వరకు ‘కింగ్డమ్’ కి మంచి ఓపెనింగ్స్ సొంతమయ్యాయి. కానీ సోమవారం నుండి ఈ సినిమా అసలు బండారం బయటపడింది.
సినిమా చూసిన కామన్ ఆడియన్స్.. ‘గట్టిగా లేపారు తప్ప.. ఇందులో విషయం లేదు’ అని తేల్చేశారు. ఏదేమైనా వీకెండ్ కలెక్షన్స్ తో 70 శాతం రికవరీ సాధించింది. తర్వాత బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నెట్టుకు రాలేకపోయింది.అలా యావరేజ్ మార్క్ వద్ద ఈ సినిమా ఆగిపోయింది.
ఇక ఈరోజు అంటే ఆగస్టు 27న ఓటీటీలోకి వచ్చింది ‘కింగ్డమ్’. నెట్ ఫ్లిక్స్ లో ‘కింగ్డమ్’ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. సాధారణంగా థియేటర్లలో లేని సన్నివేశాలు కొన్ని ఓటీటీలో దర్శనమిస్తూ ఉంటాయి. ‘కింగ్డమ్’ విషయానికి వస్తే.. రిలీజ్ కి ముందు ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన ‘హృదయం లోపల’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది. కానీ థియేటర్లలో ఆ పాట లేదు. సినిమా ఫ్లోకి ఆ పాట సింక్ అవ్వలేదు అని తీసి పడేసినట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. అయితే ఓటీటీలో ఈ పాట ఉంటుందేమో అని భాగ్య శ్రీ బోర్సే అభిమానులు భావించారు. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా వాళ్లకి హ్యాండ్ ఇచ్చింది అనే చెప్పాలి.