Pallavi Prashanth: నేను కూడా మనిషినే కదా.. పల్లవి ప్రశాంత్ కామెంట్స్ వైరల్!

  • December 21, 2023 / 11:51 AM IST

బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టిన ఈయన తన ఆట తీరు ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని చివరికి కప్పు గెలుచుకున్నారు. ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని కాస్త అత్యుత్వాహం కనబరిచారు. ప్రశాంత్ అభిమానులు బిగ్ బాస్ కంటెస్టెంట్ అమర్ అలాగే అశ్విని కార్లపై రాళ్ల దాడి చేశారు.

అంతటితో ఆగకుండా ఆర్టీసీ బస్సులపై కూడా రాళ్ల దాడి చేయడంతో ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్ తో పాటు మరి కొందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీగా తన గ్రామానికి చేరుకోవడంతో అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఇక పల్లవి ప్రశాంత్ కప్పు గెలవడంతో ఎంతోమంది మీడియా వారు అలాగే యూట్యూబర్స్ అక్కడికి చేరుకొని ప్రశాంత్ తో వరుసగా ఇంటర్వ్యూలు చేశారు.

ఇకపోతే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఒక వీడియోని షేర్ చేసినటువంటి పల్లవి ప్రశాంత్ నాకోసం ఇంత మంది అభిమానులు వచ్చారు అంటే ఆశ్చర్యం కలుగుతుంది మీడియా వారు మీరు కూడా చూస్తున్నారు కదా అన్న ఇక్కడికి ఎంతమంది వచ్చారో. వారందరిని చూస్తుంటే నాకోసం ఇంతమంది వచ్చారా అని సంతోషమేస్తుంది కానీ ఆ సంతోషం లేకుండా మీరు చేస్తున్నారని ఈయన తెలిపారు.

ఈ సంతోషాన్ని కూడా నేను (Pallavi Prashanth) ఎంజాయ్ చేయలేకపోతున్నానని నిజంగా బాధగా ఉందని ఏడిస్తే మీరు ఎక్కడ నన్ను నెగిటివ్ చేస్తారో అని భయంగా కూడా ఉందని తెలిపారు. సుమారు 60 నుంచి 70 మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు వారందరికీ ఇంటర్వ్యూ ఇవ్వడం అంటే నా చేత కావడం లేదు నేను కూడా మనిషినే కదా కనీసం నన్ను అన్నం కూడా తిననివ్వడం లేదు. ఇలా వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం నావల్ల కావడం లేదు అంటూ ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus