Bigg Boss 7 Telugu: 14వ వారం నామినేషన్స్ లో అమర్ మాటలకి ఏడ్చిన పల్లవి ప్రశాంత్ ! ఎందుకో తెలుసా?

  • December 5, 2023 / 10:39 AM IST

బిగ్ బాస్ హౌస్ లో 14వ వారం నామినేషన్స్ అనేది ఒక రేంజ్ లో అయ్యాయి. ముఖ్యంగా ఈవారం కెప్టెన్ అమర్ దీప్ నామినేషన్స్ దుమ్ములేపేశాడు. పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ కడిగిపారేశాడు. ను్వ్వు సిల్లీ పాయింట్స్ కి నామినేట్ చేస్తావ్, అదే ఎవరైనా చేస్తే మాత్రం తీస్కోలేవని అన్నాడు. అంతేకాదు, గతవారం నాకు కెప్టెన్సీ రావడంలో నువ్వు చేసిన సపోర్ట్ ఏమీ లేదని అన్నాడు. చివర్లో శోభాశెట్టి పిలిచినా కూడా నువ్వు రాలేదని తన తప్పుని ఎత్తి చూపించాడు. దీనికి అప్పుడు శివాజీ అన్న వెళ్తానని చెప్పాడని అందుకే నేను రాలేదని మొత్తుకున్నాడు పల్లవి ప్రశాంత్.

ఇద్దరికీ ఈవిషయంలో వాగ్వివాదం అయ్యింది. నువ్వు ఏడుస్తుంటే నేను వచ్చి మాట్లాడాను అని, దిల్ సే నేను నీతో ఉన్నానని ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. అంతేకాదు, నీ దోస్త్ లు నిన్ను మోసం చేశారని చెప్తే నిన్ను నమ్మినా, నీకు సపోర్ట్ చేసినా , కానీ నువ్వు మోసం చేశావ్. నమ్మక ద్రోహం చేశావ్ అంటూ రెచ్చిపోయాడు. నేను చెప్పేది కరెక్ట్ కాకపోతే బయట ప్రేక్షకులే ఊస్తారు అని అనేసరికి, నామీద నేను ఊమ్ముకోవాలంటూ పల్లవి ప్రశాంత్ మాటకి మాట బదులు ఇచ్చాడు.

ఇక అమర్ ఆవేశంగా నిన్ను శోభా పిలిచినపుడు రాకుండా బజర్ వచ్చేటపుడు అన్నం తింటున్నానని అబద్దం చెప్తావా ? ఆగరా నువ్వు నీ వేషాలు , శివాజీ అన్న చెప్పినపుడు నేను వెళ్తా అని అనలేకపోయావా ? అంటే, మోసం చేసింది నువ్వు అంటూ పల్లవి ప్రశాంత్ ఎదురు తిరిగాడు. అన్న వెళ్తానన్నా సరే నేను మాటిచ్చా అన్నా నేను వెళ్తా అని చెప్పాలి అది మగాడి మాట అంటే, నువ్వు ఆడోడి మాట మాట్లాడుతున్నావా అన్నాడు పల్లవి ప్రశాంత్ దీనిపైన కూడా పెద్ద యుద్ధమే జరిగింది.

సార్, మీరే విన్నర్ సార్ మేమంతా గోతులు తవ్వడానికి వచ్చినామ్ సార్ అంటూ అమర్ రెచ్చిపోయాడు. నన్ను బయటకి పంపించేయండి., వాడికి కప్పు ఇచ్చేయండి మీరందరూ హ్యాపీగా ఉండండి. నువ్వు కూడా హ్యాపీగా ఉండు అంటూ మాట్లాడాడు అమర్ దీప్. ఇక ఈగొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. అరేయ్ అని సంభోదించి మాట్లాడుతుంటే, అలా అనొద్దని పల్లవి ప్రశాంత్ రెచ్చిపోయాడు కూడా. అలాగే, మళ్లా ఇంకోసారి నాతోని మాట్లాడద్దన్నా అంటూ ఆవేశంగా చెప్పాడు.

ఇక అమర్ దీప్ తర్వాత యావర్ ని సైతం నామినేట్ చేస్తూ ఇదే హీట్ ని కొనసాగించాడు. వీరిద్దరి మద్యలో కూడా బాగా ఆవేశంగా మాటలు దొర్లాయి. యావర్ అయితే రెచ్చిపోయి మరీ అమర్ దీప్ పైకి వెళ్లాడు. ఇద్దరూ కొట్టుకుంటారా అన్నట్లుగా అయ్యింది పరిస్థితి. ఇక శివాజీ వచ్చి ఇద్దరినీ పక్కకి తీశాడు. ఈవారం (Bigg Boss 7 Telugu) నామినేషన్స్ లో అమర్ దీప్ నామినేషన్స్ అనేది హైలెట్ గా నిలిచాయ్. అదీ మేటర్.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus