Balakrishna: బాలయ్య బాబీ కాంబో మూవీలో లక్కీ ఛాన్స్ దక్కిన బ్యూటీ ఆమేనా?

  • September 12, 2023 / 04:21 PM IST

స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. బాలయ్య బాబీకాంబో మూవీ పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శ్రీనిధి శెట్టి నటించనున్నారని సమాచారం అందుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కనుందని భారీ లెవెల్ లో ఈ సినిమా విడుదల కానుందని సమచారం అందుతుండటం గమనార్హం. బాలయ్య, శ్రీనిధి శెట్టి జోడీ బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య, శ్రీనిధిశెట్టి ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి. 2024 సంవత్సరం ఫస్టాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సితార నిర్మాతలు ఈ సినిమాను ఊహించని రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య బాబీ కాంబో మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం గమనార్హం. బాలయ్య బాబీ కాంబో మూవీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కనుంది.

సినిమా సినిమాకు (Balakrishna) బాలయ్య రేంజ్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. బాలయ్య తన సినిమాల కథ, కథనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య తన సినిమాలను పండుగల సమయంలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాలయ్య మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తే బాగుంటుందని కొంతమంది ఫీలవుతున్నారు. రాబోయే రోజుల్లో బాలయ్య ఎలాంటి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది.

బాలయ్య తన ప్రాజెక్ట్ లతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు. నందమూరి హీరోల కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమా వస్తుందేమో చూడాలి. బాలయ్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.బాలయ్య మూవీతో శ్రీనిధి శెట్టి జాతకం మారుతుందేమో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus