Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పటేల్ సార్

పటేల్ సార్

  • July 15, 2017 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పటేల్ సార్

జగపతిబాబు కొన్నాళ్ళ విరామం అనంతరం కథానాయకుడిగా నటించిన చిత్రం “పటేల్ సర్”. జగపతిబాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ద్వారా వాసు పరిమి దర్శకుడిగా పరిచయమయ్యాడు. వారాహి చలనచిత్రం సంస్థ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ మంచి అంచనాలను రేపింది. మరి అంచనాల స్థాయిలో సినిమా ఉందో లేదో చూద్దాం..!!

కథ : పటేల్ సార్ (జగపతి బాబు) ఓ చిన్ని పాప యామిని (బేబీ డాలీ)ని వెంటేసుకొని.. సిటీలో పేరు మోసిన గూండాలను ఒకొక్కరిగా ప్రత్యేకమైన పద్ధతుల్లో చంపుతుంటాడు. ఆఖరి వ్యక్తిని చంపేలోపు మాత్రం గుండెనొప్పి కారణంగా పోలీసులకి దొరికిపోతాడు. అసలు పటేల్ సార్ ఎవరు, గూండాలని చంపడానికి ఎందుకు పూనుకొంటాడు? ఆ చిన్నపిల్లను ఎందుకు వెంటేసుకొని తిరుగుతుంటాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “పటేల్ సార్” సినిమా.

నటీనటుల పనితీరు : జగపతిబాబు మంచి ఆర్టిస్టే కానీ.. ఎమోషన్స్ ను పండించడంలో ముందు నుంచీ కాస్త వీక్. ఈ సినిమాలోనూ అంతే.. యాక్షన్ సీక్వెన్స్ ల వరకూ పర్లేదు కానీ.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తేలిపోయాడు. లుక్ పరంగా మాత్రం జగపతిబాబు కెరీర్ లో బెస్ట్ అని చెప్పుకోవాలి. తాన్య హోప్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అందంగా కనిపించిందే కానీ.. పోలీస్ ఆఫీసర్ బాడీ లాంగ్వేజ్ ను ఎక్కడా మెయింటైన్ చేయలేదు. బికినీ సీన్ లో మాత్రం కాస్త ఉదారత చూపి శృంగార రసాన్ని రసవత్తరంగా పండించింది. జగపతిబాబు భార్య పాత్రలో “మృగం, అందరి బంధువయా” ఫేమ్ పద్మప్రియ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అలరించింది. సుబ్బరాజు, కబీర్ సింగ్, పృధ్వీ వంటి నటులు విలనిజాన్ని ఎప్పట్లానే పండించారు.

సాంకేతికవర్గం పనితీరు : వసంత్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. థీమ్ మ్యూజిక్ కాపీయే అయినా సన్నివేశానికి బాగా సింక్ అయ్యింది. “అల్లిబిల్లి..” పాట వినసోంపుగానే కాక అర్ధవంతంగానూ ఉంది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. టింట్, కలరింగ్, వి,ఎఫ్.ఎక్స్ వంటి అన్నిట్నీ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు. స్లోమోషన్ షాట్స్, ఎలివేషన్ షాట్స్ ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. డైలాగ్స్ లో ప్రాసలే తప్ప అర్ధం చాలా తక్కువగా వినిపించింది. దర్శకుడు వాసు పరిమి చాలా హాలీవుడ్ సినిమాల నుండి కథ మరియు టేకింగ్ ను ఇన్స్ ఫైర్ అయ్యాడన్న విషయం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తూనే ఉంటుంది. అందువల్ల.. టేకింగ్ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది తప్ప, స్క్రీన్ ప్లే కానీ ఆర్టిస్టుల నటన కానీ అలరించే స్థాయిలో లేకపోవడంతో సినిమా ఆకట్టుకోలేక డీలాపడుతుంది. నిజానికి ఈ రివెంజ్ డ్రామాను ఇంకా ఆసక్తికరంగా తెరకెక్కించేందుకు బోలెడన్ని అవకాశాలున్నాయి. కానీ.. డైరెక్టర్ మాత్రం కేవలం జగ్గూభాయ్ స్టైలింగ్ మీద మాత్రమే దృష్టిసారించి మిగతా విషయాలను గాలికొదిలేయడంతో సినిమా అటకెక్కింది.

విశ్లేషణ : ఒక్క డైరెక్టర్ తప్ప.. సినిమా కథ-కథనం-థీమ్ అన్నీ పాతవే. సో, జగపతిబాబు ఎంత స్టైలిష్ గా కనిపించినా.. శ్యామ్ కె.నాయుడు అద్భుతమైన సినిమాటోగ్రఫీ వర్క్, వసంత్ కష్టపడి కాపీ కొట్టి మరీ పేస్ట్ చేసిన ఆకట్టుకొనే బ్యాగ్రౌండ్ స్కోర్ వంటి ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నా.. అసలు విషయం (కథ) బలహీనం కావడంతో అందరి శ్రమ బూడిదలో పోసిన పన్నీరులా తయారయ్యింది. ఉరమాసు ఆడియన్స్ కూడా కష్టపడి చూడాల్సిన “పటేల్ సార్”ను సగటు ప్రేక్షకులు భరించడం కష్టమే.

రేటింగ్: 1.5/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Subbaraju
  • #Hero Jagapathi Babu
  • #jagapathi babu
  • #Patel S.I.R Movie
  • #Patel S.I.R Movie Rating

Also Read

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

related news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

44 mins ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

3 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

19 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

19 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

19 hours ago

latest news

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

24 mins ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

2 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

18 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

19 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version