Pavitra Lokesh: ప‌విత్ర లోకేశ్ భారీగా ఖర్చు పెడుతుంది దేనికోసమంటే..?

పవిత్రా లోకేష్.. గతకొద్ది రోజులుగా టాలీవుడ్, శాండల్‌వుడ్‌లో ఈమె పేరు బాగా వినిపిస్తోంది. మీడియా, సోషల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అయ్యాయి. దానికి కారణం అందరికీ తెలిసిందే. సీనియర్ యాక్టర్ వీకే నరేష్‌తో పవిత్ర సహజీవనం చేస్తుంది. నరేష్ భార్య వీళ్లిద్దర్నీ మైసూరులో ఓ హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నరేష్ అంటే తనకిష్టమని, అందుకే ఆయనతో ఉంటున్నానని క్లారిటీ ఇచ్చింది. అప్పటినుండి వీళ్లిద్దరూ హాట్ టాపిక్‌గా మారారు.

స్క్రీన్ మీద నరేష్, పవిత్ర కనిపిస్తే జనాలు గోల చేస్తున్నారు. ఇక వీళ్లపై వచ్చే మీమ్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఫన్నీ అండ్ క్రియేటివ్ మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పవిత్రా లోకేష్ ఫిట్‌నెస్ గురించి, దాని మెయింటినెన్స్ కోసం ఆమె చేస్తున్న కోట్లాది రూపాయల భారీ ఖర్చు గురించి కొన్ని ఆసక్తికర విషయాాాలు వెలుగులోకి వచ్చాయి. నలభై ఏళ్లు దాటిన పవిత్ర ఫిజిక్ కోసం హీరోయిన్ల మాదిరిగానే డైట్ తీసుకుంటుందట.. అలాగే స్కిన్ టోన్ కాపాడుకోవడానికి కేవలం క్రీమ్స్ కోసమే లక్షల్లో ఖర్చుచేస్తోందట..

కొద్దిరోజల క్రితమే ఫిజిక్ మీద ఫోకస్ పెట్టిన ప్రగతి ఇంతకముందు కంటే ఇప్పుడు కాస్త సన్నగా కనిపిస్తోంది.డైట్ వర్కౌట్ అవుతుందనే అనుకోవాలి. తన కంటే వయసులో పెద్దవాళ్లే స్లిమ్‌గా కనిపిస్తూ గ్లామర్ మెయింటెన్ చేస్తుంటే తనకేం తక్కువ అనుకుందేమో కానీ కాస్త సీరియస్‌గానే డైట్, వర్కౌట్స్ వంటివి చేస్తుందట. స్పెషల్‌గా జిమ్ ట్రైనర్‌ని నియమించుకుని రోజూ గంటల తరబడి చెమటోడుస్తుందట. అలాగే డ్రెస్సింగ్ స్టైల్ మార్చడం కోసం కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారని కన్నడ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.

పవిత్ర లోకేష్ భర్త సుచీంద్ర ప్రసాద్ కూడా కన్నడ కూడా నటుడే. ఈమె ముందుగా ఒక సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది. మనస్పర్ధల కారణంగా అతనికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత సుచీంద్ర ప్రసాద్‌తో కొద్దికాలం సహ జీవనం చేసి 2018 నుంచి అతనికి దూరంగా ఉంటోంది. తర్వాత వీకే నరేష్‌తో ప్రేమాయణం.. త్వరలో వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. ఈ న్యూస్ నిజమైతే కనుక ఇది నరేష్‌కి నాలుగో పెళ్లి, పవిత్రకి ముచ్చటగా మూడో పెళ్లి అవుతుంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus